కొన్ని ఘటనలు నిజంగానే జరిగినా ఓ పట్టాన నమ్మలేం. ఇలాంటి ఘటనే త్రిపురలో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ పై మొన్న గురువారం హత్యాయత్నం జరిగింది.
ఏకంగా ముఖ్యమంత్రిపైనే హత్యాయత్నం జరిగిందన్న విషయం ఆలస్యంగా వెలుగుచూసినా మొదట్లో ఎవరు నమ్మలేదు. కాకపోతే తర్వాత సీసీ ఫుటేజీని పరిశీలించిన తర్వాత హత్యాయత్నం నిజమే అని నమ్మాల్సొచ్చింది
ఇంతకీ విషయం ఏమిటంటే మొన్న గురువారం సాయంత్రం తన ఇంటికి దగ్గరలోనే ఉండే ట్రాక్ పై సీఎం విప్లవ్ కుమార్ వాకింగ్ చేస్తున్నారట. సాయంత్రం వాకింగ్ లో ఉన్నారు కాబట్టి సెక్యురిటీ కూడా పెద్దగా లేరు.
ఈ విషయాన్ని కొన్నిరోజులుగా గమనిస్తున్న గుర్తుతెలీనివ్యక్తులు హఠాత్తుగా వాకింగ్ చేస్తున్న విప్లవ్ పైకి కారుతో దూసుకువచ్చారట. అయితే ప్రమాధాన్ని ముందుగానే గమనించిన విప్లవ్ వెంటనే పక్కకు తప్పుకున్నారట.
కారు స్పీడుగా దూసుకురావటం, సీఎం పక్కకు తప్పుకోవటాన్ని చివరి నిముషంలో గుర్తించిన భద్రతా సిబ్బంది వెంటనే అలర్టయి కారును పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే వాళ్ళ ప్రయత్నం ఫెయిలైంది.
అయితే హత్యాయత్నంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. కొద్దిసేపటి తర్వాత కారును, అందులోని ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నారు. వారిని విచారించిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రత్యర్ధులపై దాడులు చేసి గాయపరచటం, లేదా హత్యలు చేయటం మామూలుగా జరుగుతున్నదే. కానీ ఏకంగా ఓ సీఎంపైనే దుండుగులు హత్యకు దిగటంతో చాలా ఆశ్చర్యపోతున్నారు.
సీఎంకు కట్టుదిట్టమైన భద్రత ఉంటుందని అందరికీ తెలిసిందే. ఆ భద్రతను చేదించుకుని ముదుకు వెళ్ళటమంటే మామూలు విషయం కాదు. అయినాసరే విప్లవ్ కుమార్ పై హత్యకు ప్లాన్ చేశారంటే వీళ్ళు మామూలోళ్ళు కాదని అర్ధమైపోతోంది. సరే విచారణలో అన్నీ వివరాలు తెలుస్తాయి లేండి.