ఏపీలో సీఎం జగన్ పగ్గాలు చేపట్టిన తర్వాత టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయని విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఏపీలో జగన్ రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తూ…పులివెందుల పంచాయతీలకు తెరతీశారని, ఫ్యాక్షన్, రివేంజ్ పాలిటిక్స్ కు జగన్ తెరతీశారని టీడీపీ అధినేత చంద్రబాబు పలుమార్లు విమర్శలు గుప్పించారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని డీజీపీ సవాంగ్ కు పలుమార్లు చంద్రబాబు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు.
ఈ నేపథ్యంలోనే జగన్ అండ చూసుకొని అధికార పార్టీ నేతల ఆగడాలకు అడ్డు అదుపూ లేకుండా పోయిందని విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమపై వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడికి తెగబడిన ఘటన ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది. కృష్ణా జిల్లాలో ఉమ ప్రయాణిస్తున్న కారుపై వైసీపీ నేతలు, కార్యకర్తలు రాళ్లతో దాడి చేయడం సంచలనం రేపింది. ఈ దాడిలో ఉమ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.
గడ్డమనుగూరు కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో అక్రమ మైనింగ్ జరుగుతోందని వస్తోన్న ఆరోపణలను పరిశీలించేందుకు ఉమ అక్కడికి వెళ్లారు. అక్రమ మైనింగ్ కార్యకలాపాలను పరిశీలించి వస్తుండగా జి.కొండూరు మండలం గడ్డ మణుగ గ్రామం వద్ద ఉమ వాహనంపై ఒక్కసారిగా వందల మంది వచ్చి దాడి చేశారు. విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని వైసీపీ కార్యకర్తలకు ఎదురొడ్డి ఉమకు రక్షణ కల్పించారు.
ఆ తర్వాత కొద్ది సేపటికి ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు…ఇరు వర్గాల కార్యకర్తలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఓ దశలో ఇరు వర్గాలు జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టబోయాయి. ఆ తర్వాత దేవినేని ఉమను నిర్బంధంలోకి తీసుకోవడానికి పోలీసులు ప్రయత్నించడంతో పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. కారు దిగితే ఉమను అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పడంపై టీడీపీ కార్యకర్తలు మండిపడ్డారు. ఎమ్మెల్యేలు వసంత కృష్ణ ప్రసాద్, జోగి రమేష్ కనుసన్నల్లో వారి అనుచరులు ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు.
ఎస్పీ సిద్ధార్ధ కౌశల్
దేవినేని ఉమ ను అరెస్ట్ చేశాం మా కస్టడీ లోనే ఉన్నారు
శాంతి భద్రతల కు విఘాతం కలించారు
100% ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం
దేవినేని ఉమ పై కంప్లైంట్ ఆధరంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నాం
డీఐజీ మోహనరావు
దేవినేని ఉమ ఉద్దేశ పూర్వకంగా ముందస్తు ప్రణాళికతో జి.కొండూరులో అలజడి సృష్టించారు
ఊదేశపూర్వకగానే దేవినేని ఉమ వివాదం సృష్టించారు
ముందోస్తు పథకం లో భాగంగా దుర్దేశం పూర్వకంగా ఉమ కొండపల్లి నుంచి తన అనుచరులతో వెళ్లారు
ఈరోజు జరిగిన పూర్తి ఆలజడికి దేవినేని ఉమ కారణం
వైకాపా కార్యకర్తల ను రెచ్చ కొటే విధంగా ఉమ వ్యహరించారు
హైడ్రామా మధ్య దేవినేని ఉమా నీ నందివాడ పోలీస్ స్టేషన్ కి తరలింపు
నందివాడ పోలీస్ స్టేషన్ కి వెళ్లే రహదారులను ఐదు కిలోమీటర్ల ముందే దిగ్బంధనం చేసిన పోలీసులు
స్థానికులు సైతం ఆధార్ కార్డ్ ఉంటేనే అనుమతిస్తున్న వైనం
మీడియాను సైతం పోలీస్ స్టేషన్ వద్దకు అనుమతించని పోలీసులు