హెడ్డింగ్ పొరపాటున పెట్టలేదు
అదే నిజం.
ఆర్థిక కష్టాలు చుట్టుముట్టి పాలన అగమ్యగోచరంగా తయారైన తరుణంలో జగన్ ని జైలుకు పంపి ప్రజల్లో హీరోని చేయొద్దు.
ఆయన బెయిలు క్యాన్సిల్ చేయొద్దు.
తాగుబోతులు (లిక్కర్) తిరుగుబోతులు (పెట్రోలు) మొత్తం జగన్ కి ఎదురు తిరిగే సమయం ఆసన్నం అవుతున్నపుడు ఆయన బెయిలు క్యాన్సిల్ చేసి జగన్ ని కాపాడవద్దని… పాలనలో కష్టం ఏంటో జగన్ కి తెలియాలని, జగన్ వల్ల రాష్ట్రం ఎంత అధ్వానంగా తయారవుతుందో ఆయనకు ఓటేసిన వారికి తెలియాలని తెలుగుదేశం సోషల్ మీడియా కార్యకర్తలు కోరుకుంటున్నారు. తాము కోరుకోవడానికి కారణాలు విశ్లేషిస్తున్నారు.
జగన్ బెయిల్ క్యాన్సిల్ కాద్దని తెలుగుదేశం కార్యకర్తలు దేవుడుకి మొక్కుతున్నారట.
సింపతీని ఓటుగా మార్చుకోవడంలో వైఎస్ కుటుంబం పీహెచ్డీ చేసిందని, వారికి మరోసారి అవకాశం ఇవ్వద్దు దేవుడా అని కోరుకుంటోంది టీడీపీ క్యాడర్.
జగన్ సీఎం గా కొనసాగాలి… ఎట్లా మేనేజ్ చేస్తాడో మా కళ్లతో మేమూచూడాలి అంటున్నారు తెలుగుదేశం కార్యకర్తలు.
వినడానికి చాలా విచిత్రంగా ఉన్నా నిజం ఇదేనట.