అమరావతి భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ వైసీపీ నాయకులు నానా యాగీ చేసిన సంగతి తెలిసిందే. అమరావతి భూముల్లో టీడీపీ ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందంటూ వైసీపీ నేతలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దీనికితోడు, అమరావతిలో ఇన్ సైర్ ట్రేడింగ్ అనే అంశమే లేదంటూ హైకోర్టు కూడా చెప్పింది. అయినా, వైసీపీ అధినేత, సీఎం జగన్ మాత్రం …ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబును కేసుల్లో ఇరికించాలని విఫలయత్నం చేశారు.
అసలు అమరావతి భూముల కొనుగోళ్లలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదని సీఐడీ నమోదు చేసిన కేసులను కొట్టివేస్తూ హైకోర్టు గతంలో తీర్పునిచ్చింది. అంతేకాదు, ఈ వ్యవహారంపై నియమించిన సిట్ దర్యాప్తుపై కూడా హైకోర్టు స్టే విధించిందని. అయితే, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆ వ్యవహారంపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పులో తప్పేముందని జగన్ సర్కార్ ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
హైకోర్టు తీర్పును తప్పుబడుతూ ఏపీ సర్కార్ దాఖలు చేసిన 6 పిటిషన్లపై విచారణ జరిగింది. అన్ని కోణాల్లో విచారణ జరిపిన తర్వాతే తీర్పు ఇచ్చినట్లు కనిపిస్తోందని దేశపు అత్యున్నత ధర్మాసనం వ్యాఖ్యానించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేయడానికి కారణాలేమిటని ప్రభుత్వ తరఫు న్యాయవాది దవేను సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. రాజధాని ఎక్కడ వస్తుందో పబ్లిక్ డొమైన్లో ఉందని తెలిపింది.
సుప్రీం కోర్టులో ఈ కేసు విచారణను వాయిదా వేయాలని పదేపదే విజ్ఞప్తి చేయడంతో ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసును ఎందుకు వాయిదా వేయాలి..? మేమడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి’ అని స్పష్టం చేసింది. అనేక కోణాల్లో హైకోర్టు అన్ని అంశాలను అధ్యయనం చేసి తీర్పునిచ్చిందని తెలిపింది. భూములు విక్రయించిన వారు ఏదైనా చెబితే తప్ప సివిల్ లయబిలిటీ ఉందో లేదో రుజువు చేయలేమని అభిప్రాయపడింది.