రాజకీయాల్లో యువతను ఎంత ఉత్సాహపరిస్తే అంత పాపులర్ లీడర్ అవుతారు.
రాజకీయాలను సోషల్ మీడియా శాసిస్తున్న నేటి రోజుల్లో దాన్ని బలంగా ఎవరు వాడితే వారే విన్నర్.
తరచూగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తెలుగుదేశం సీనియర్ నాయకుడ గోరంట్ల బుచ్చయ్య చౌదరి తాజాగా వైసీపీ కార్యకర్తలకు బంపరాఫర్ ఇచ్చారు.
తెలుగుదేశం ప్రభుత్వంలో కంటే జగన్ ప్రభుత్వంలో కరెంటు బిల్లు తక్కువ వస్తోంది అని ఎవరైనా నిరూపిస్తే ఆ బిల్లు నేనే కడతాను అంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సవాల్ విసిరారు.
ఈ ఆఫర్ తో వైసీపీ నాయకులకు షాక్ తిన్నంత పనయ్యింది. ఎందుకంటే దీనికి కౌంటర్ ఎలా ఇవ్వాలో తెలియక వైసీపీ నేతలు తలపట్టుకుంటున్నారు.
గోరంట్ల అడిగింది వాస్తవం… అప్పటితో పోలిస్తే కరెంటు బిల్లులు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఎవరూ కూడా బుచ్చయ్య విసిరిన సవాల్ ను స్వీకరించి నిరూపించలేరు. అదే సమయంలో ప్రజలకు వైసీపీ ప్రభుత్వం కరెంటు బిల్లులు పెంచిన విషయాన్ని చాలా స్ట్రాంగ్ గా ప్రజల మెదళ్లలో నాటే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి.
వైసీపీ కార్యకర్తలు @YSRCPDMO@YSRCParty కి @ysjagan నాయకులు కి పే టియం కార్మికులు కి ఓపెన్ ఛాలెంజ్..!#గోరంట్ల????#YCP_LootingApPublic_HikingPowerbills pic.twitter.com/VN7SPSWhmU
— Gorantla butchaiah choudary (@GORANTLA_BC) July 11, 2021