కొన్ని సార్లు రాజకీయ నాయకులు చాలా క్యాజువల్ గా అన్నమాటలు వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి మాట ఒకటి గోదావరి జిల్లా తెలుగుదేశం నేత జవహర్ మాట్లాడుతూ డీజీపీ గౌతమ్ సవాంగ్ మీద చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి.
ఇంతకీ ఏం జరిగిందో ఆయన మాటల్లో చెప్పాలంటే… ‘‘ రాజమండ్రి పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక తొలిసారి నా ఇంటికి వచ్చాను. ఈ క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. నా ఇంటికి నేను వెళ్తుంటే.. దానికి కూడా వీళ్లకు వీసాలు, పాస్ పోర్టులు, పోలీసులు అనుమతులు చూపించి వెళ్లాలా? చివరకు అంబేద్కర్, జగ్జీవన్ రాం విగ్రహాలకు పూలమాల వేస్తుంటే అడ్డుకున్నారు. మహానుభావులకు పూలమాలలు వేయడం ఏమైనా ఉగ్రవాద చర్యనా? ‘‘ అని మాజీ మంత్రి జవహర్ వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్ ను సోషల్ మీడియా క్యాచ్ చేసింది. ‘‘పోలీసుల అతి చూస్తుంటే… రాబోయే రోజుల్లో గౌతమ్ సవాంగ్ ఎంపీగా పోటీ చేస్తారేమో వైకాపా నుంచి అని అనిపిస్తుంది’’ అన్నారు జవహర్. ఇదిపుడు వైరల్ అవుతోంది. ఆయన ఇంకో మాట కూడా అన్నారు. కొందరు పోలీసుల అతి చూస్తుంటే వైకాపా టిక్కెట్లను ఆశిస్తున్నట్లు అనిపిస్తున్నాయి వారి చర్యలు అని అన్నారు.
ప్రతిదానికి టీడీపీ నేతలపై కేసులు పెట్టే పోలీసులు వైకాపా నేతల ర్యాలీలపై ఎన్ని కేసులు పెట్టాలో చెప్పాలన్నారు. పోలీసులు మేము పాకిస్తాన్లో ఉన్న ఫీలింగ్ కలిగిస్తున్నారని అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు జవహర్. ఏపీలో ఐపీసీ సెక్షన్లు పనిచేయడం లేదు, అని వైసీపీ సెక్షన్లే అమలవుతున్నాయి అని మరో ఆసక్తికరమైన కామెంట్ చేశారు. పోలీసులు ఇలాగే వ్యవహరిస్తే ప్రైవేటు కేసులు పెడతాం అని అన్నారు.