రావాలి జగన్
కావాలి జగన్
అని పాపం జనం కోరి కోరి తెచ్చుకుంటే… మా ముఖ్యమంత్రి పనిచేయడం లేదని ఆ పార్టీలోని మోస్ట్ యాక్టివ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి స్వయంగా చెబుతున్నారు.
ఉత్తినే పథకాలకు డబ్బులు అప్పులు చేసి మరీ విసిరేస్తున్న జగన్
ఆపదలో ఉన్న వారు అయ్యా మా ఆస్పత్రి ఖర్చులకు డబ్బులు ఇయ్యండని దరఖాస్తు చేస్తే చూద్దాం లే అని ఫైళ్లన్నీ పక్కన పెట్టేస్తున్నారు. ఇదేదో ప్రతిపక్షాలు చెప్పిన మాట కాదు.
ఆ పార్టీ ఎమ్మెల్యే చెప్పిన మాటను ఈ వీడియోలో మీరు వినొచ్చు.
వాళ్ళు వెనక్కి పంపిస్తే నేనేం చెయ్యాలా . సంవత్సరం అవుతుంది CM రిలీఫ్ ఫండ్ నుండి ఒక్క బిల్ కూడా రాలేదు . వెయ్యికి పైగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయమా – కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి
But Jagan has money for Kathi Mahesh.
— Bhavya???? (@unexpected5678) July 3, 2021
సామాన్యులు పాపం ఎమ్మెల్యేలు చుట్టు తిరిగినా, ఎమ్మెల్యేలు రెకమెండ్ చేసినా లక్ష రెండు లక్షలు ఇవ్వడానికి ఏడుస్తున్న ముఖ్యమంత్రి అదే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి క్రిస్టియన్ ప్రచాకర్త, హిందువుల ఆరాధ్యదైవం శ్రీరాముడిని దూషించిన కత్తి మహేష్ కు ఉన్న పళంగా 17 లక్షలు విడుదల చేశారు.
సామాన్యుల బాధలు ఓదార్చలేని జగన్ కత్తి మహేష్ కి ఎందుకు డబ్బులు ఇచ్చారు?
ఇదే ఆసక్తికరమైన విషయం దానికి ఒక నెటిజన్ సమాధానం ఇక్కడ చూడొచ్చు
పవన్ కల్యాణ్ ని తిట్టింది ఎవరు – కత్తి మహేష్,శ్రీ రెడ్డి,రాం గోపాల్ వర్మ
వీళ్లంతా ఏ పార్టీ – వైసీపీ
సైనిక్స్ ఏడ్చేది ఎవరి మీద – టీడీపీ
నాయకుడికి ఒక దశ , దిశ ఏడిస్తే కదా, అనుచరులకు ఎడవడానికి .
CC : @munnabhai9394
— Antonie Das (@CBN__MSD) July 3, 2021
పవన్ కళ్యాణ్ – టీడీపీ పొత్తును చెడగొట్టడానికి ప్రత్యేక కుట్రతో శ్రీరెడ్డిని, కత్తి మహేష్ ను, రాంగోపాల్ వర్మను వాడుకున్న వైసీపీ పార్టీ విజయవంతంగా వారిని విడగొట్టింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక వారు బయటపడ్డారు. శ్రీరెడ్డి స్వయంగా జై జగన్ అంటోంది. జగన్ కి బెయిలు క్యాన్సిల్ కాకుండా ఉంటే తాను ఏం చేయమన్నా చేస్తాను అంటోంది. మరోవైపు కత్తి మహేష్ హిందు దేవుళ్లను దూషిస్తూ వైసీపీ నాయకులతో తిరుగుతున్నారు. డ్రైవర్లను పెట్టుకుని పెద్ద పెద్ద కార్లలో తిరిగే కత్తి మహేష్ కు పేదలకు సాయం చేసే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి డబ్బులు ఎలా ఇచ్చారు.
మరి పేదలకు ఇవ్వమంటే ఒక్క రూపాయి ముఖ్యమంత్రి ఇవ్వడం లేదని స్వయంగా రెడ్డి ఎమ్మెల్యే చెప్పారంటే… వైసీపీ ఎవరి కోసం పనిచేస్తుందో స్పష్టంగా అర్థమైపోతుంది.