రేవంత్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా నియమించినప్పటి తెలంగాణ రాజకీయాల్లో అనేక మందికి భయం పట్టుకుంది. ముఖ్యంగా ఇటీవలే కాస్త ఎదిగినట్టు అనిపిస్తున్న బీజేపీకి గొంతులో వెలక్కాయ పడినట్టయ్యింది. ఇక కేసీఆర్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వేరే ఎవరిని పీసీసీ అధ్యక్షుడిని చేసినా కేసీఆర్ కి పెద్ద లాభం లేదు. వారిని ఏదో ఒక బలహీనత మీద కొట్టడమో, కోవర్టుగా మార్చుకోవడమో తెలుసు. కానీ రేవంత్ వద్ద కేసీఆర్ ఆటలు చెల్లవు.
వీరిద్దరు మాత్రమే కాదు, ఇంకా పుట్టని షర్మిల పార్టీలో కలకలం మొదలైంది. ఎందుకంటే తెలంగాణలో రెడ్లకు లీడర్ షిప్ లేదు, ఆ స్థానాన్ని ఆక్రమించడానికి వైఎస్ఆర్ కుటుంబం వేసిన కుట్రే షర్మిల పార్టీ అని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. వారింత ఆత్మవిశ్వాసంతో ముందుకు రావడానికి కారణం ఒకటే. రేవంత్ తప్ప కాంగ్రెస్ లో మరి ఎవ్వరూ రెడ్లకు ఐకాన్ కాలేకపోయారు. కానీ తెలుగుదేశం నుంచి వచ్చిన రేవంత్ కు పీసీసీ పదవి ఇవ్వరు కాబట్టి… మనం పార్టీ పెడితే రెడ్లను ఏకం చేయొచ్చు అని జగన్ భావించి షర్మిలను రంగంలోకి దింపారు.
కేసీఆర్ ను మూడోసారి ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా షర్మిల పార్టీ పురుడు పోసుకుంటోంది. పదేళ్లలో కచ్చితంగా పెరిగే ప్రభుత్వ వ్యతిరేకత కాంగ్రెస్, బీజేపీలకు పోకుండా ఓ పది సీట్లు సంపాదించి కేసీఆర్ ను సీఎం చేయడానికి జగన్ పన్నిన పన్నాగాన్ని కాంగ్రెస్ అధిష్టానం పసిగట్టింది. ఆ కుట్రను పటాపంచలు చేస్తూ రేవంత్ రెడ్డిని పీసీసీ ఛీఫ్ ను చేసింది.
రేవంత్ ని పీసీసీ ఛీఫ్ ను చేయడంతో కేవలం కాంగ్రెస్ మాత్రమే కాదు, న్యూట్రల్ వర్గం కూడా ఎంతో హర్షం వ్యక్తంచేసింది. రాజకీయ శూన్యతను ఆసరాగా చేసుకుని కుటుంబం మేలు కోసం ప్రభుత్వం నడుపుతున్న కేసీఆర్ కు రేవంత్ సరైన ప్రత్యర్థి అని తెలంగాణ ప్రజానీకం నమ్ముతోంది. పైగా రేవంత్ రెడ్డి జగన్ లాగా క్రిస్టియన్ రెడ్డి కూడా కాదు. షర్మిల అయితే ఏకంగా క్రిస్టియన్ మాత్రమే. ఈ నేపథ్యంలో షర్మిల పార్టీకి రేవంత్ నియామకం అశనిపాతమే.
అందుకే ఈరోజు షర్మిల తన అక్కసునంతా వెళ్లగక్కింది. ‘‘టీడీపీ నాయకుడిని కాంగ్రెస్ పార్టీ తమ పార్టీకి అధ్యక్షుడిని చేసిందని షర్మిల అన్నారు . “టిడిపి నుండి పార్టీలోకి దూకిన వారిని తమ అధ్యక్షుడిగా ఎన్నుకున్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది” అని ఈ సందర్భంగా షర్మిల వ్యాఖ్యానించారు.
ఈరోజు జగన్ షర్మిల ఇల్లు అయిన లోటస్ పాండ్ లో షర్మిల పార్టీ కోసం YSSR website ను ప్రారంభించారు. రాష్ట్రంలో రాజన్న రాజ్యం తిరిగి తీసుకురావాలని అనుచరులకు ఆమె పిలుపునిచ్చారు. ఈ సమావేశంలోని ఆమె పై వ్యాఖ్యలు చేశారు.