వైసీపీ అధినేత జగన్, వైసీపీ నేతలు అందరికీ అధికారం రాగానే ఏమైనా చేసుకోవచ్చన్న భ్రమలు గట్టిగా ఉన్నాయి. అందుకే ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోవడం… కోర్టుల్లో ఎదురు దెబ్బలు తినడం మామూలైపోయింది.
భారతరాజ్యాంగం, ఐసీసీ … ఈ రెండు ప్రతి పనికి ఒక పద్ధతి, ప్రతి తప్పుకు ఒక శిక్ష నిర్దేశించాయి. అయినా వైసీపీ నేతలకు వీటిపై అవగాహన లేకనే ఇలాంటి పనులు చేస్తున్నారు.
తాజాగా సీఎం చేసిన బిగ్ మిస్టేక్ పై ఏపీ హైకోర్టు స్పందించింది. ముఖ్యమంత్రి జగన్ తనపై గతంలో నమోదైన 11 ప్రాంతీయ కేసులను ఎత్తివేస్తూ జీవో ఇచ్చేసుకున్నారు.
హమ్మ దొంగా… అది మీ ఇష్టం కాదు, అలా చేయడం కుదరదు అంటూ హైకోర్టు అడ్డు పడింది. దీనిపై ఎడాపెడా కేసుల ఎత్తివేత కుదరదని గతంలో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులు చెప్పిన విషయాన్ని హైకోర్టు గుర్తుచేసింది.
జగన్ తనంతట తాను తనపై ఉన్న ఆ పదకొండు కేసుల ఎత్తివేత నిబంధనల ప్రకారమే జరిగిందా? ఇందులో లోటుపాట్లు ఉన్నాయా? అనే విషయాన్ని హైకోర్టు తేల్చనుంది.
ఈ 11 కేసుల్లో ఒక ఎగ్జాంపుల్ ఇది…
మీకు గుర్తుందా… కృష్ణా జిల్లా నందిగామలో రోడ్డు ప్రమాదం జరిగితే జగన్ అప్పట్లో బాధితులను పరామర్శించేందుకు వెళ్లారు. పోలీసు ఆంక్షలను ఉల్లంఘించి ఆస్పత్రిలోకి దూసుకెళ్లి… డాక్టర్ల చేతిలోని పత్రాలను లాక్కున్నారు. అక్కడే ఉన్న కలెక్టర్ అహ్మద్బాబును నోటికొచ్చినట్లు తిట్టారు. ఈ రభసపై జగన్పై కేసు నమోదైంది. ప్రస్తుతం రద్దు చేసిన కేసుల్లో ఇది కూడా ఉంది.