బాలీవుడ్ హాట్ భామల్లో అగ్రస్థానంలో నిలుస్తుంది కత్రినాకైఫ్. ఇప్పటికే ఆమెను పలువురితో ముడిపెడుతూ వార్తలు వచ్చాయి. ఇటీవల కాలంలో ఆమెకు సంబంధించిన వార్తలు పెద్దగా రావటం లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా ఆమె నటుడు విక్కీ కౌశల్ తో డేటింగ్ లో ఉందని.. వారిద్దరి మధ్య రిలేషన్ నడుస్తుందని స్టార్ హీరో నటుడి కుమారుడు వెల్లడించిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
బాలీవుడ్ ఎవర్ గ్రీన్ హీరోల్లో వెటర్నర్ స్టార్ అనిల్ కపూర్ తెలుసు కదా? అతడి కుమారుడు హర్షవర్ధన్ కపూర్. నటుడిగా పరిచయమున్న అతడు ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా మీరు నిజమని నమ్ముతున్న ఒక బాలీవుడ్ జంట లవ్ రూమర్స్ మీద స్పందించాలన్న వెంటనే.. కత్రినా.. విక్కీ రిలేషన్ మీద ఓపెన్ అయ్యాడు.
వారిద్దరి మధ్య రిలేషన్ నడుస్తుందని.. తాను వాస్తవమే చెప్పానని చెప్పాడు. అయితే.. ఆ విషయాన్ని తాను చెప్పటం ద్వారా తనకు ఏమైనా ఇబ్బందులు వస్తాయన్న విషయం తెలీదన్న అతడు.. వారిద్దరూతమ మధ్య ఉన్న బంధం గురించి ఇప్పటికే ఎన్నో సార్లు చెప్పేశారంటూ తన వాదనను సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశారు. బాలీవుడ్ లో జరిగే పలు ఫంక్షన్లకు ఇద్దరు కలిసి వస్తారన్న విషయాన్నిఈ సందర్భంగా పలువురు గుర్తు చేసుకుంటున్నారు. అయితే.. తమ మధ్య ఉన్న రిలేషన్ గురించి అటు కత్రినా కానీ.. ఇటు విక్కీ కానీ ఓపెన్ అయ్యింది లేదు. ఇలాంటివేళ.. హర్షవర్దన్ వ్యాఖ్యకు ఈ లవ్ బర్డ్స్ ఎలా రియాక్టు అవుతాయో చూడాలి.