• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

NRI : అమెరికాలో మనోళ్ల బతుకులు ఇంతేనట.. షాకింగ్ సర్వే

చేదు నిజాన్ని చెప్పిన తాజా సర్వే.. అమెరికాలో మనోళ్లకు అవి తప్పవట

admin by admin
June 10, 2021
in Around The World, Top Stories
0
0
SHARES
392
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

అగ్రరాజ్యమైన అమెరికాలో అన్ని దేశాల ప్రజలు ఉంటారు. సింఫుల్ గా చెప్పాలంటే నానాజాతి సమితి అని చెప్పేసుకోవచ్చు. ఆ మాటకు వస్తే.. అమెరికా దేశం.. ఫలానా జాతివారి సొంతమన్న మాట ఉండదు. వలస జీవులతో నిండిన అమెరికాలో తెల్లతోలు వాళ్లంతా తమకు మించిన అమెరికన్లు ఉండరన్నట్లుగా ఫోజులు కొడతారు. అమెరికా జాతి నిర్మాణంలో రక్తం చిందించిన నల్లోళ్లను ఇప్పటికి రెండో శ్రేణి పౌరులుగా చూడటం.. వారి పట్ల జాత్యాంహాకారాన్ని ప్రదర్శించటం తెలిసిందే.

విదేశీయులుగా ఆ దేశానికి వెళ్లి కాల క్రమంలో అక్కడే పట్టు సాధించిన దేశీయుల్లో భారతీయులు ఎక్కువగా ఉంటారు. ఆ మాటకు వస్తే అమెరికాకు వలస వచ్చిన వారిలో భారతీయులే అత్యధికమన్న మాట వినిపిస్తూ ఉంటుంది. పలువురు భారతీయ అమెరికన్లు ఇప్పుడు ప్రముఖ స్థానాల్లో ఉన్నారు. అయినప్పటికీ ఆ దేశంలో భారతీయ అమెరికన్లు నిత్యం వివక్షను ఎదుర్కోవటం సర్వసాధరణమన్న విషయాన్ని తాజాగా నిర్వహించిన సర్వే వెల్లడించింది. మొత్తం అమెరికన్లలో ఇండియన్ అమెరికన్లు 1 శాతం కంటే ఎక్కువ ఉన్నారు. రిజిస్టర్ ఓటర్లలో ఒక శాతం కంటే తక్కువ ఉన్నారు.

కార్నెగీ ఎండోమెంట్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ పీస్, జాన్స్‌ హాప్కిన్స్‌–ఎస్‌ఏఐఎస్, యూనివర్సిటీ పెన్సిల్వేనియా సంయుక్తంగా ఒక సర్వేను గత ఏడాది నిర్వహించాయి. దీనికి సంబంధించిన నివేదికను బుధవారం విడుదల చేశారు. ఈ సర్వేలో భాగంగా అమెరికాలో నివసించే 1200 మంది భారతీయ అమెరికన్లను ఆన్ లైన్ ద్వారా ప్రశ్నించారు. వారిచ్చిన ఫీడ్ బ్యాక్ తో ఈ సర్వే రిపోర్టును రూపొందించారు. తాజా రిపోర్టులో ప్రధానంగా ప్రస్తావించిన అంశం.. ప్రతి ఇద్దరిలో ఒకరు తాము అమెరికాలో వివక్షను ఎదుర్కొంటున్నట్లుగా చెప్పారు.

తమ చర్మం రంగుకు సంబంధించి తరచూ అవహేళనకు గురి అవుతుంటామని చెప్పారు. భారత్ నుంచి అమెరికాకు వెళ్లి.. అక్కడి దేశ పౌరులుగా మారిన వారు మాత్రమే కాదు.. అమెరికాలో పుట్టి పెరిగిన భారతీయుల పరిస్థితి కూడా ఇదేనని చెప్పటం గమనార్హం. భారతీయ తండ్రి – అమెరికా తల్లి, భారతీయ తల్లి – అమెరికా తండ్రికి పుట్టిన వారు సైతం ఇలాంటి వివక్షనే ఎదుర్కొంటున్నట్లు వాపోవటం గమనార్హం. ఇదంతా ఒక ఎత్తు అయితే.. భారతీయ అమెరికన్ల జీవితాల్లో మతం కీలకపాత్రను పోషిస్తున్నట్లు పేర్కొన్నారు. రోజుకు ఒకసారైనా ప్రార్థన చేస్తామని 40 శాతం మంది చెబితే.. వారంలో ఒక్కరోజైనా మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటామని 27 శాతం మంది చెప్పటం గమనార్హం.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. కులాన్నికూడా భారతీయ అమెరికన్లు విడిచిపెట్టటం లేదన్న విషయం తాజా సర్వేలో వెల్లడైంది. ఇండియాలో పుట్టి అమెరికాకు వెళ్లిన వారు తమ పేరుతో పాటు.. తాము ఏ కులానికి చెందిన వారిమన్న విషయాన్ని వదులుకోవటానికి ఇష్టపడటం లేదని తేలింది. అదే సమయంలో వారి పుట్టిన సంతానం మాత్రం కులానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరని తేలింది. మొత్తం హిందువుల్లో ప్రతి పది మందిలో ఎనిమిదిమంది తమ కులంపై ప్రత్యేక అభిమానాన్ని ప్రదర్శించటం గమనార్హం.

Tags: dollar dreamsIndians life in USALifestylenrisshocking surveyUSA
Previous Post

Nandamuri Balakrishna : బాలయ్య పుట్టిన రోజున అభిమానుల ‘అఖండ’ గర్జన

Next Post

కత్రినా రిలేషన్ ఎవరితోనో చెప్పేసిన స్టార్ హీరో కొడుకు

Related Posts

Andhra

అల్లూరి వేడుక శ్రీ‌కాకుళం మ‌రింత ప్ర‌త్యేకం

July 5, 2022
Movies

పేరు మార్చుకున్న టాలీవుడ్ స్టార్ హీరో?

July 5, 2022
Trending

బ్రేకింగ్:రఘురామపై మరో కేసు

July 5, 2022
Trending

37 నెలల్లో జగన్ చేసిందేంటో చెప్పిన దేవినేని ఉమ

July 5, 2022
Movies

‘ఆర్ఆర్ఆర్’ గే మూవీ అంటోన్న ఆస్కార్ గ్రహీత

July 5, 2022
Trending

నెక్స్ట్ రఘురామ ఏపీలో అడుగుపెట్టేది అప్పుడేనట

July 5, 2022
Load More
Next Post

కత్రినా రిలేషన్ ఎవరితోనో చెప్పేసిన స్టార్ హీరో కొడుకు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • అల్లూరి వేడుక శ్రీ‌కాకుళం మ‌రింత ప్ర‌త్యేకం
  • పేరు మార్చుకున్న టాలీవుడ్ స్టార్ హీరో?
  • బ్రేకింగ్:రఘురామపై మరో కేసు
  • 37 నెలల్లో జగన్ చేసిందేంటో చెప్పిన దేవినేని ఉమ
  • ‘ఆర్ఆర్ఆర్’ గే మూవీ అంటోన్న ఆస్కార్ గ్రహీత
  • నెక్స్ట్ రఘురామ ఏపీలో అడుగుపెట్టేది అప్పుడేనట
  • చంద్రబాబును నమ్ముకుంటే ఆత్మహత్యలే..టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు
  • పిల్లల్ని కనని వాళ్లకి అవార్డు ఇస్తా
  • కావాలోయ్ ! మెగా ప్ర‌శ్న‌ల‌కు సమాధానాలు !
  • శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్ర‌యంలో సీజేఐ జ‌స్టిస్ ర‌మ‌ణ దంప‌తుల‌కు ఘ‌న వీడ్కోలు
  • ఆ రెండింట్లోంచి పవిత్ర లోకేష్ అవుట్
  • యథా రాజా.. తథా పోలీసు!
  • ఆ హిందువుల ఊచకోతపై సాయి పల్లవి వివాదాస్పద వ్యాఖ్యలు
  • జగన్ గుడ్డోడు…లోకేశ్ అంత మాటెందుకున్నారంటే…
  • అయినోళ్లే ముంచేస్తాండారు అప్పుడూ..ఇప్పుడూ !

Most Read

ఆ రెండింట్లోంచి పవిత్ర లోకేష్ అవుట్

యథా రాజా.. తథా పోలీసు!

కావాలోయ్ ! మెగా ప్ర‌శ్న‌ల‌కు సమాధానాలు !

చంద్రబాబును నమ్ముకుంటే ఆత్మహత్యలే..టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

జ‌గ‌న్‌పై సెటైర్లు…ఎవరికైనా చూపించడ్రా…అలా వదిలేయకండి…

అయినోళ్లే ముంచేస్తాండారు అప్పుడూ..ఇప్పుడూ !

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra