జగన్ పాలనకు రెండేళ్లు… నిన్నటి నుంచి వైసీపీ నేతలు అభిమానులు విజయవంతమైన పాలన అంటూ ఉత్సవాలు చేసుకుంటున్నారు. జగన్ కూడా యథావిధిగా తనకు అలవాటైన నవ్వుతో వంద శాతం చెప్పిన మాటలు నెరవేరుస్తున్నాం… కొన్ని ఆన్ ద వే అన్నారు.
కానీ లోకేష్ చెప్పినట్టు ఏదో వేరే రాజ్యాంగం ఏమైనా అమలవుతుందేమో ఏపీలో తెలియదు గాని… అయ్యా నువ్వు ఈ హామీలు ఇచ్చావు, కానీ వీటిని మరిచావు అని ఎవరూ జగనన్నకు గుర్తుచేయడం లేదు.
మనం అయినా గుర్తుచేద్దాం. అపుడు జగనన్న ఈ హామీలను కూడా నెరవేరుస్తాడని ఆశిద్దాం. ఇంతకీ మనం జగనన్న మరిచిపోయిన హామీలేంటో ఒకసారి చూద్దామా?
1) 45 సంవత్సరాలకే మహిళలకు ఇస్తానన్న పింఛను ?
2) కేంద్రంతో సంబంధం లేకుండా రైతు భరోసా కింద ఇస్తాను అన్న 12,500 ?
3) రెండేళ్లలో పూర్తి చేస్తానన్న కడప ఉక్కు పరిశ్రమ ?
4) రేషన్ లో సన్న బియ్యం పంపిణీ చేస్తాను అన్న హామీ ?
5) వారంలో మీ ఇంటికి నడుచుకుంటూ వచ్చింది అన్న రేషన్ కార్డు ?
6) వారంలో రద్దు చేస్తాను అన్న సిపిఎస్ ఎక్కడ ? (సస్పెన్షన్ కోరే ఉద్యోగులు ప్రశ్నించొచ్చు ఈ మాట)
7) కుటుంబంలో ఎంతమంది ఉన్నా అందరికీ అమ్మ ఒడి పథకం ? (ఇస్తున్నది ఇంటికి ఒక పిల్లాడికే)
8) 25 లక్షల ఇళ్లు కట్టిస్తామని అన్నా హామీ ఎక్కడ ? (సెంటు భూమి ఇచ్చాడు ఇల్లు కట్టడం మరిచాడు. సెంటు భూమి కూడా 20 శాతం మందికే అందింది)
9) అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్టు ఉద్యోగాలు పర్మినెంట్ ?
10) అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్తాను అన్న 3000 పింఛన్ ?
11) ప్రమాణ స్వీకారం రోజు ప్రతి సంవత్సరం పెంచుతారు అన్న 250 పింఛను ? (ఒకసారే పెంచారు… ఇక మరిచారు)
12) పరుగులు పెట్టి ఇస్తాను అన్న పోలవరం, అమరావతి ?
13) తితిలి తుఫాను బాధితులకు ఇస్తానన్నా నష్ట పరిహారం ? బాధిత ప్రాంతాల్లో 50 రోజుల లోపు పర్యటన ఎక్కడ ?
14) ప్రతి సంవత్సరం జనవరిలో విడుదల చేస్తాను అన్న ఉద్యోగ క్యాలెండర్ ?
15 ) అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే తీస్తానన్న మెగా డీఎస్సీ ?
16) రైతులకు ఉచిత బోర్లు ? (పథకం పేరు మార్చాడు, బోర్లు వేయడం మాత్రం జాన్తానై)
17) అన్నా క్యాంటీన్ల అవినీతిని బయట పెట్టి 3 నెలల్లో ప్రారంభిస్తాను అన్న రాజన్న క్యాంటీన్ ఎక్కడ ?
18) ప్రతిపక్షంలో ప్రచారం చేసిన చంద్రబాబు పై ఆరు లక్షల కోట్ల అవినీతి ఎక్కడ ?
19) అగ్రిగోల్డ్ బాధితులకు మొదటి సంవత్సరమే ఇస్తాను అన్న 1150 కోట్లు ఎక్కడ ?
20) కరోనా బాధితులకు ఇస్తాను అన్న 2000 సహాయం ఎక్కడ ? మరణించిన వారి అంత్యక్రియలకు ఇస్తాను అన్న 15000 ఎక్కడ ?
21) ప్రతిపక్షంలో ఉండగా చేసిన అమరావతి, పోలవరంలో అవినీతి రికార్డులు ఏమయ్యాయి ?
22) నాడు చంద్రబాబే కొట్టేశాడు అన్న పింక్ డైమండ్ ఎక్కడ ?
23) నారా లోకేష్ బినామీ అన్న శేఖర్ రెడ్డి ఎక్కడ ?
24) తండ్రిని చంపాడు ఉన్న రిలయన్స్ అధినేత ఎక్కడ ?
25) కేంద్రం మెడలు వంచి సాధిస్తాను అన్న ప్రత్యేక హోదా ఎక్కడ ?
26) రైతుల కోసం ఏర్పాటు చేస్తాను అన్న 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఎక్కడ ?
27) ప్రతి లీటరు పాలకు అదనంగా ఇస్తాను అన్న 4 రూపాయలు ఎక్కడ ?
28) ప్రతిపక్షం నుంచి వచ్చేవారిని రాజీనామా చేయించి తీసుకుంటాను అన్న హామీ ఎక్కడ ?
29) ప్రమాదాల వల్ల మరణించిన ప్రతి ఒక్కరికి ఇవ్వాలని నాడు డిమాండ్ చేసిన కోటి రూపాయల పరిహారం ఎక్కడ ?
30) తెలంగాణ కెసిఆర్ తో కలిసి సాధిస్తాను అన్న ప్రత్యేక హోదా ఎక్కడ ?
31) సొంత బాబాయ్ హత్య కేసులో నాడు డిమాండ్ చేసిన సిబిఐ విచారణ ఎక్కడ ?
32) చంద్రబాబు ఇచ్చాడు అన్న 35 మంది కమ్మ డిఎస్పీలు ఎక్కడ ?
33) పట్టిసీమ ప్రాజెక్టులో జరిగింది అన్న 100 కోట్ల అవినీతి ఎక్కడ ?
34 ) లోకేష్ చేసాడు అన్న ఫైబర్ గ్రిడ్ లో అవినీతి ఎక్కడ ?
మరి ఇదంతా పక్కన పెడదాం. చంద్రబాబు మొదటి రెండేళ్ల పాలనతో జగన్ రెండేళ్ల పాలన ఒకసారి పోల్చిచూద్దామా?
చంద్రబాబు తొలి రెండేళ్ల పాలన Vs జగన్ రెడ్డి రెండేళ్ల పాలన?
తొలి రెండేళ్లలో సంక్షేమ పథకాల ద్వారా బాబు ప్రభుత్వం Vs జగన్ ప్రభుత్వం ఎవరు ఎక్కువ ఇచ్చారు?
ఎవరు అభివృద్ది చేశారు ?#JaganDestroyedAPin2Years pic.twitter.com/sFTbUtEdQI
— Telugu Desam Party (@JaiTDP) May 30, 2021
అన్ని అప్పులు ఎలా తేగలిగాడు అని దేశమంతా అన్నవైపే చూస్తున్నారు.
https://twitter.com/TheRockyBhai/status/1399304508883144712
ఒకసారి అన్న మాటలు విందామా రెండేళ్ల కిందట మాట…
శ్రీ వైఎస్ జగన్ గారు అధికారం లోకి వచ్చిన వెంటనే ప్రతీ సంవత్సరం జనవరి 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ విడుదల చేస్తాం అని హామీ ఇచ్చారు. ఇప్పుడైనా మీ రెండేళ్ల పాలన సంబరాల్లో భాగంగా విడుదల చేసిన పుస్తకంలో దీనిపై సమాధానం చెప్తారని మన యువత ఆశగా ఎదురు చూస్తున్నారు. pic.twitter.com/E8sdw8y9fv
— Dr. Sandeep Panchakarla (@DrSandeepJSP) May 30, 2021