అల్లోపతి వైద్యంపై తీవ్ర వ్యాఖ్యలు చేయటం ద్వారా వైద్యులు ఆగ్రహావేశాలకు గురవుతున్న ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా.. తాజాగా మరోసారి తన నోటికి పని చెప్పారు. ఈసారి ఆయన కొవిడ్ వ్యాక్సిన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. టీకా సామర్థ్యంపై ఆయన విమర్శలు చేశారు.
వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా కొందరు మరణిస్తున్నారని.. అల్లోపతి వైద్య విధానం వంద శాతం పని చేయలేదనటానికి ఇదే నిదర్శనమన్నారు.
నిజానికి రాందేవ్ బాబు చెప్పటం ఏముంది? నూటికి నూరు శాతం వ్యాక్సిన్ సామర్థ్యం లేదని.. ప్రపంచంలో ఇప్పుడు అందుబాటులో ఉన్న ఏ టీకా కూడా కొవిడ్ రాకుండా అడ్డుకోలేదని.. కాకుంటే.. ఇమ్యునిటి పెరగటంతో పాటు.. కోవిడ్ నుంచి కొంతమేర రక్షణ కలిగించే సామర్థ్యం మాత్రమే ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు. అలాంటప్పుడు కొవిడ్ టీకా వందశాతం పని చేయటం లేదన్న విషయాన్ని కొత్తగా చెప్పటానికి ఏమీ లేదు.
ఇదిలా ఉంటే.. తాను కొన్ని దశాబ్దాలుగా యోగాభ్యాసం చేస్తున్నాని.. ఆయుర్వేద విధానాన్ని అనుసరిస్తున్నానట్లు చెప్పిన రాందేవ్ బాబా.. తనకు వ్యాక్సిన్ అవసరం లేదన్నారు. ఆయుర్వేదమనే పురాతన చికిత్సకు భారత్ లో పాటు విదేశాల్లో కూడా ఫాలో అవుతున్నారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్ల మంది వరకు ఆయుర్వేదాన్ని అనుసరిస్తున్నారన్నారు.
ఆయుర్వేదాన్ని అల్లోపతి విధానంతో పోలుస్తూ.. కొందరు ఉద్దేశపూర్వకంగా తక్కువ చేసి చూపిస్తున్నారంటూ మండి పడిన రాందేవ్.. రాబోయే రోజుల్లో ఆయుర్వేదానికి ప్రపంచ వ్యాప్తంగా ఆమోదం లభిస్తుందన్నారు. ఏమైనా తాను నమ్మిన ఆయుర్వేదాన్ని గొప్పదిగా అభివర్ణించటాన్ని తప్పు పట్టలేం. ఆల్లోపతిని విమర్శించటం తప్పుగా చెప్పక తప్పదు.
ఏమైనా.. ఆల్లోపతి.. ఆయుర్వేదం రెండు ప్రాణాల్ని రక్షించేవే. రెండింటిని శాస్త్రీయంగా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా ప్రజలకు మరింత మేలు చేయాల్సిన అవసరం ఉంది. అంతేకానీ.. గొప్పల్లోకి పోవటం.. అది కూడా కరోనా వేళలో సరైనది కాదన్నది మర్చిపోకూడదు. మొత్తంగా రొమాంటిక్ ట్రిప్ కాస్తా.. ఎప్పటికి మర్చిపోలేని చేదు అనుభవాన్ని చెక్సీకి మిగిల్చిందని చెప్పాలి.