ప్రభాస్ కు కాలం బాగా కలిసొస్తున్నట్లుంది. వరుసగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ప్రాజెక్టులు చేతపట్టాడు. అన్ని భారీ బడ్జెట్ లేదా భారీ కాన్సెప్టులే.
అందులో ఒకటి నాగ్ అశ్విన్ తీస్తున్న ప్రభాస్ 21వ సినిమా ఇది. దీనికి నాగ్ అశ్విన మామ అశ్వినదత్ నిర్మాత.
ప్రభాస్ 21 బాహుబలిని మించి పోవాలన్న తలంపుతో ఉన్నారో ఏమో గానీ మొత్తం బాలీవుడ్ ను పట్టుకువచ్చేస్తున్నారు.
ఈ ప్రాజెక్టులో సుమారు పది మంది బాలీవుడ్ స్టార్స్ నటిస్తున్నారట.
అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు ఇప్పటికే తేలింది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, బాలీవుడ్ టాప్ యాక్టర్ ఇందులో విలన్ గా నటిస్తాడట.
మరో 5 నుంచి 6 మంది ప్రముఖ బాలీవుడ్ నటులు ఇతర ప్రముఖ పాత్రల్లో కనిపిస్తారట. మొత్తం మీద, హిందీ సినిమాలోని సుమారు 10 మంది అగ్ర నటులు ప్రభాస్ 21 ప్రాజెక్టు లో ముఖ్యమైన పాత్రలు పోషించనున్నారు.
ఇంత భారీ కాస్టింగ్, భారీ బడ్జెట్ చూస్తుంటే… మామ అల్లుడు (నాగ్ అశ్విన్, అశ్వినిదత్) కలిసి ప్రభాస్ ని ఎవరెస్టుపై కూర్చోపెడతారేమో.
మరింత నటులున్నారు కదా… సినిమా బడ్జెట్ 500 కోట్లు టచ్ అవుతుందేమో. ఎందుంటే ఈ సినిమాలో నటీనటుల రెమ్యునరేషనే సుమారు రెండు వందల కోట్లట. ఇదే నిజమైతే ఇప్పటి వరకు ప్రభాస్ కెరీర్లో ఇది అత్యంత ఖరీదైన చిత్రం కానుంది.