జగన్ ప్రభుత్వం తప్పు మీద తప్పు చేస్తోంది కాబట్టే… అవి ఎవరైనా బయటపెడతారనమే భయంతో వరుస అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. మహానాడు (వర్చువల్)లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని అన్నారు. ఆయన చూపిన దారిలోనే ఆత్మగౌరవం కాపాడుకుంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తున్నట్లు చంద్రబాబు చెప్పారు.
అందరూ కలిస్తేనే పార్టీ. టీడీపీ అన్ని కులాలు, మతాల ప్రజలకు చెందినది. అఖిలాంధ్రుల విశేష మన్ననలు పొందిన పార్టీ కాబట్టే దీనిని పడగొట్టేందుకు జగన్ రెడ్డి విఫలయత్నాలు చేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.
తన అసమర్థ పాలనతో తప్పులు చేస్తూ… ప్రభుత్వ తప్పులపై మాట్లాడుతున్న వారిని అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇది ప్రభుత్వ ఉగ్రవాదం. చివరకు కోర్టులను కూడా బెదిరించే స్థాయికి వచ్చారంటే వీరెంత తెగించారో అర్థమవుతోంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మచ్చుకు కూడా కానరాని పరిస్థితి ఏర్పడిందని చంద్రబాబు ఆందోళన వ్యక్తంచేశారు.
అచ్చెన్నాయుడుతో మొదలు పెట్టిన అక్రమ కేసుల పర్వాన్ని జనార్దన్ రెడ్డి వరకు కొనసాగించారు… ప్రతి కేసు తప్పుడు కేసే అని పదేపదే తేలుతోంది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. చివరకు సొంత ఎంపీ రఘురామకృష్ణరాజుపై అక్రమ కేసులు పెట్టి… పోలీసు కస్టడీలో శారీరకంగా హింసించారు. రఘురాజు విషయంలో స్థానికంగా వ్యవస్థలను మేనేజ్ చేసే సుప్రీంకోర్టులో అడ్డంగా బుక్ అయ్యారని అన్నారు.
తప్పుడు పనులు చేస్తే ఎక్కడో ఒకచోట బ్రేక్ పడక తప్పదన్నారు.
పార్టీ కార్యకర్తల, నాయకుల మృతికి నివాళులు అర్పించిన మహానాడు.#DigitalMahanadu2021 pic.twitter.com/a6fvcAL0E0
— Telugu Desam Party (@JaiTDP) May 27, 2021