`అన్నాత్తే` సినిమా సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో దాదాపు 35 రోజుల పాటు జరిగింది. దీంతో అప్పటి నుంచి రజనీ ఇక్కడే ఉన్నారు. బుధవారం హైదరాబాద్ షెడ్యూల్ పూర్తవడంతో రజనీకాంత్ చెన్నై వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. వెళ్లిన ఒక్క రోజు గ్యాప్‌తోనే ఆయన మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకుని ఆయన అమెరికా వెళ్లబోతున్నట్టు తెలుస్తుంది.
తన హెల్త్ సమస్యలకు సంబంధించి హెల్త్ చెకప్ కోసం రజనీ అమెరికా వెళ్లబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. కరోనా కట్టడికి వ్యాక్సిన్ చాలా ముఖ్యమనే విషయం తెలిసిందే.
45 ళ్లు పైబడిన వాళ్లు ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రజనీ వ్యాక్సిన్ తీసుకోవటం జరిగింది.
ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ గత కొద్ది రోజులుగా అన్నాత్తె సినిమా కోసం హైదరాబాద్‌లో ఉన్నారు. గత ఏడాది డిసెంబర్లో అనారోగ్యానికి గురి కావడం వలన షూటింగ్ వాయిదా పడగా, ఇప్పుడు అది పూర్తి చేశారు.
షూటింగ్ పూర్తయ్యాక రజనీకాంత్ తన స్నేహితుడు మోహన్ బాబు ఇంటికి వెళ్లి కొద్ది సేపు గడిపారు. మోహన్ బాబు ఇంటికి వెళ్లిన సమయంలో రజనీకాంత్‌తో సెల్ఫీ దిగింది మంచు లక్ష్మీ. వాటిని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
కాగా, మోహన్ బాబు ఇంటి నుండి డైరెక్ట్‌గా బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిన రజనీకాంత్ ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్లారు. ఇంటికి చేరుకోగానే రజనీకాంత్ కు ఆయన సతీమణి లతా హారతి ఇచ్చి ఆహ్వానించారు.
ప్రస్తుతం రజనీకాంత్ ఎయిర్ పోర్ట్ ఫొటోలు, చెన్నై ఇంటికి వెళ్లిన సమయంలో తీసిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
అన్నాత్తె చిత్రాన్ని సిరుతై శివ దర్శకత్వం తెరకెక్కిస్తుండగా, సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, నయనతార, మీనా, ఖుష్బూ, కీర్తి సురేశ్ కీలక పాత్రలను పోషిస్తున్నారు.