తమిళ కమెడియన్ పాండు(74) కరోనాతో మరణించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు ఇటీవల కోవిడ్ సోకింది. దీంతో ఆయనను చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం ఆయన మరణించారు. పాండుకు భార్య కుముద, ముగ్గురు కుమారులు ఉన్నారు.
పాండు భార్య కూడా ప్రస్తుతం కరోనాతో బాధపడుతున్నారు. ఆమె చెన్నైలో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉందని తమిళ సినీవర్గాల నుంచి వినిపిస్తోంది.
పాండు హైస్కూలు చదువు పూర్తయిన తరువాత సినిమాలపై ఆసక్తితో గట్టి ప్రయత్నాలు చేశారు.
1970 లో మానవన్ సినిమాతో నటుడిగా అరంగేట్రం చేశాడు. అందులో అతను విద్యార్థి పాత్రను పోషించాడు.
‘కరైల్లెం షేన్బాగపూ’తో అతనికి మంచి గుర్తింపు వచ్చింది. ఈ చిత్రంలో తన సోదరుడు ఇడిచాపులి సెల్వరాజ్తో పాండు స్క్రీన్ షేర్ చేసుకున్నాడు.
పాండు మృతిపై తమిళ సినీ పరిశ్రమ సంతాపం తెలిపింది.