సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేతలపై కక్ష సాధిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతోన్న సంగతి తెలిసిందే. టీడీపీ నేతలను బెదిరించి వైసీపీకి మద్దతుగా నిలిచేలా చేసుకోవడం…బెదిరింపులకు లొంగని నేతల ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడం, అక్రమ కేసులు పెట్టి వేధించడం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ రకంగా ఇప్పటికే పలువురు టీడీపీ నేతలను వైసీపీ సర్కార్ వేధించిందన్న ఆరోపణలున్నాయి.
ఈ క్రమంలోనే సంగం డెయిరీలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర, సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్, సహకారశాఖ మాజీ అధికారి గురునాథంలను అరెస్ట్ చేసిన ఘటన కలకలం రేపింది. వారిని 5 రోజుల పాటు ఏసీబీ కస్టడీకి ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం అనుమతించింది. అయితే, తాజాగా ఆ ఉత్తర్వుల అమలును ఏపీ హైకోర్టు నిలిపేయడంతో జగన్ కు షాక్ తగిలినట్లయింది.
అంతేకాదు, వారిని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకి తరలించాలని చెప్పిన హైకోర్టు… ఈ కేసు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. అంతకుముందు, ఆ ముగ్గురిని జైలు నుంచి విజయవాడకు తరలించి ఏసీబీ కార్యాలయంలో విచారణ జరిపిన విషయం తెలిసిందే.
తన భర్తను అక్రమంగా ఈ కేసులో ఇరికించేందుకు తప్పుడు పత్రాలు సృష్టించారని ఆరోపించారు.
మరోవైపు, విజయవాడలో తన తండ్రితో మాట్లాడనివ్వాలని నరేంద్ర కూతురు కోరినప్పటికీ అధికారులు అనుమతినివ్వకపోవడంపై విమర్శలు వచ్చాయి. తాజాగా ఎంపీ గల్లా జయదేవ్ కు చెందిన అమరరాజా సంస్థపైనా పర్యావరణ కాలుష్యం పేరుతో జగన్ కక్ష తీర్చుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి.