ఆయన ఒక ముదుసలి.
వయసు 85 సంవత్సరాలు.
పేరు నారాయణ్ రావు దబార్కర్.
మహారాష్ట్రాలోని నాగపూర్ ఆయన స్వస్థలం.
నాగపూర్ అంటే ఆర్ఎస్ఎస్ కి రాజధాని.
నారాయణ్ రావు కూడా ఆర్ఎస్ఎస్ సభ్యుడే.
ఇపుడు ఆయన దేశం గర్వంగా చెప్పుకునే హీరో అయ్యాడు.
ఇంతకీ ఏం జరిగింది అంటే… నారాయణ్ రావు కూడా వైరస్ బారిన పడ్డారు. ఆయన పరిస్థితి కొంచెం ఇబ్బంది కరంగా మారింది. దీంతో ఆసుపత్రిలో చేరుద్దామని ప్రయత్నం చేస్తే బెడ్ దొరకలేదు. కొన్ని రోజుల ప్రయత్నం తర్వాత.. నారాయణ్‌కు ఉన్న మంచి పేరు వల్ల ఒక ఆసుపత్రిలో బెడ్ లభించింది. దీంతో నారాయణ్ రావును హాస్పిటల్లో చేర్పించారు.
ఆయన వెళ్లిన సమయంలో ఒక యువకుడు కరోనాతో విషమ పరిస్థితిలో కనిపించాడు. అతడికి బెడ్ అత్యవసరం. ఆ యువకుడికి పెళ్లయింది. పక్కనే భార్య కూడా కనిపించింది. నారాయణ్ రావు కరోనాతో ఇబ్బంది పడుతూ మూలుగుతూ కూడా వాళ్ల పరిస్థితి చూసి కదిలిపోయాడు. వేరే వాళ్లు అయితే ఈ టైంలో మిగతావేం పట్టించుకోరు.
కానీ ఇక్కడే నారాయణ్ రావు గొప్పతనం బయటపడింది.
తన వయసు 85 ఏళ్లు అని.. జీవితంలో చూడాల్సిందంతా చూసేశానని.. తన కంటే ఆ కుర్రాడికే బెడ్ అవసరమని… బంధువులు అంతా వద్దన్న వినకుండా తన కోసం కేటాయించిన బెడ్‌ను ఆ కుర్రాడికి ఇప్పించాడు. ఆయన ఇంటికి వెళ్లిన మూడు రోజులకు పరిస్థితి విషమించి నారాయణ్ రావు చనిపోయారు.
కానీ పోతూ పోతూ ఒక ప్రాణం పోసి పోయాడు. నారాయణ్ రావు చేసిన త్యాగం గురించి కొంత ఆలస్యంగా మీడియాలోకి సమాచారం వచ్చింది. సోషల్ మీడియాలో ఆయన గురించి ఒకటే చర్చ. ఇపుడు ఆయన లేరు. కానీ ఆయన పేరు మాత్రం మారుమోగుతోంది.
Immortal Nobel Souls ???????? pic.twitter.com/TCGRGKYaLV
— Sonal Goel IAS ???????? (@sonalgoelias) April 28, 2021