ఈరోజు ప్రజల మైండ్లో కరోనా తప్ప ఇంకోటి లేదు.
ప్రతి ఒక్కరి కష్టం, నష్టం, చర్చ కరోనా చుట్టూనే.
అలాంటి పరిస్థితిలో కేంద్రం, తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి.
ప్రజలను పూర్తిగా రోడ్డు మీద పడేశాయి. టెస్టు చేయించుకోవాలంటే వెంటనే అవకాశం లేదు. బెడ్లు లేవు, ఆక్సిజన్ లేదు, చివరికి ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల వైద్యం అందక చనిపోతే శ్మశానంలో ఖాళీ ఉండటం లేదు.
ఇలాంటి దారుణమైన పరిస్థితులో క్రైసిస్ మేనేజ్ మెంట్లో పేరున్న చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండిపోయారు.
అయినా ఏదో ఒకటి చేయాలన్న క్రమంలో తెలుగుదేశం ఒక ఆలోచన చేసింది.
హోప్. హెల్ప్.
సాయం కోసం చూస్తున్న వారి ఆశను నిలబెడుతు అండగా నిలవడమే దీని లక్ష్యం.
ట్విట్టర్లో @jaitdp కి ట్యాగ్ చేస్తూ
మెసేజ్ పెడితే తెలుగుదేశం పార్టీ వారికి అండగా నిలుస్తోంది. ఇలాంటి సమయంలో ఈ ఆలోచన పార్టీకి ఎంతో మేలు చేయనుంది. ప్రజల్లో తెలుగుదేశం పార్టీకి ఈ కార్యక్రమం ఎంతో సానుకూలతను తెచ్చిపెట్టిందనాలి. నిన్న ప్రారంభించిన ఈ ప్రత్యేక కార్యక్రమం ఫుల్ వైరల్ అయ్యింది.
ట్విట్టరులో వస్తున్న రిక్వెస్టులకు పార్టీ వేగంగా స్పందిస్తోంది.