షర్మిల భద్రత విషయంలో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఖమ్మం సభకు ముందు ఇచ్చిన భద్రతను తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆమెకు కేటాయించిన భద్రతా సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
2 + 2 సెక్యూరిటీని 3 వారాల క్రితం ప్రకటించిన కేసీఆర్ ఇపుడు ఉపసంహరించుకోవడం పెద్ద చర్చకు దారితీసింది.
ఏపీలో జగన్ పదవులు ఇవ్వకుండా చెల్లిని మోసం చేయడం వల్ల తెలంగాణ సెంటిమెంటును అడ్డుపెట్టుకుని కనీసం ఇక్కడ అయినా పదవిని అలంకరిద్దామని షర్మిల చేస్తున్న ప్రయత్నాలకు కరోనా ఆదిలోనే హంసపాదు అన్నట్టు తయారైంది.
(పోరంబోకులకు, రెడ్లకు దోచిపెట్టే) రాజన్న రాజ్యాన్ని తెలంగాణకు తీసుకువస్తానని ఆమె చేసిన శపథం 2023లోనే నెరవేర్చుకుంటాను అంటూ తన అధికార దాహాన్ని ఇప్పటికే షర్మిల ప్రకటించిన విషయం తెలిసిందే.