ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదైన వైనం తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపింది. ఈ క్రమంలోనే ఆ కేసు క్వాష్ చేయాలని తెలంగాణ హైకోర్టును కేటీఆర్ ఆశ్రయించారు. అక్కడ చుక్కెదురు కావడంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు తాజాగా నేడు దానిని కొట్టివేసింది.
కేటీఆర్ పై నమోదైన కేసు విచారణ ప్రాథమిక దశలో ఉందని, ఈ సమయంలో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. అయితే, ఈ కేసులో కేటీఆర్ ముందు అనేక ప్రత్యామ్నాయాలున్నాయని సుప్రీం సూచించింది. ఇక, ఆ క్వాష్ పిటిషన్ ను వెనక్కి తీసుకునేందుకు కేటీఆర్ కు సుప్రీం కోర్టు అనుమతినిచ్చింది. సుప్రీం కోర్టులో పిటిషన్ ఉపసంహరించుకున్న కేటీఆర్…హైకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. సుప్రీం తాజా తీర్పుతో కేటీఆర్ ను ఏసీబీ, ఈడీ విచారణ జరిపి ఏ క్షణమైనా అరెస్టు చేయవచ్చన్న ప్రచారం జరుగుతోంది.