మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ పొలిటికల్ యాక్షన్ డ్రామా `గేమ్ ఛేంజర్` సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 10న విడుదలైన సంగతి తెలిసిందే. శంకర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం మిక్స్డ్ రివ్యూలను సొంతం చేసుకున్నప్పటికీ థియేటర్స్ లో బాగానే రన్ అవుతుంది. ముఖ్యంగా నార్త్ లో ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. తొలి రోజు ఈ చిత్రం రూ. 186 కోట్ల రేంజ్ లో వసూళ్లు రాబట్టినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఇలాంటి తరుణంలోనే గేమ్ ఛేంజర్ కి బిగ్ షాక్ తగిలింది. సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే పైరసీ బారిన పడింది. అది కూడా ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్ లో హెచ్డీ క్వాలిటీ తో పైరసీ ప్రింట్ ను ప్రదర్శించారు. సంక్రాంతి పండుగ కావడంతో హైదరాబాద్ లో సెటిల్ అయిన వారంతా ఆంధ్రాకి క్యూ కట్టారు. ఫ్యామిలీతో పండుగను ఆనందంగా జరుపుకునేందుకు అందరూ ఎంతో ఉత్సాహంగా సంతూర్లకు బయలుదేరారు. ఇదే అదునుగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సు టికెట్ రేట్లు భారీగా పెంచేశాయి.
అయితే బస్సుల్లో సినిమాలు వేస్తారన్న సంగతి తెలిసిందే. కానీ విడుదలైన నెక్స్ట్ డేనే గేమ్ ఛేంజర్ సినిమాను హైదరాబాద్ నుంచి ఆంధ్ర వెళ్లే బస్సుల్లో పైరసీ ప్రింట్ ను టెలికాస్ట్ చేశారు. అంటే బస్సు టికెట్ తో ఫ్రీగా ప్రయాణికులు గేమ్ ఛేంజర్ మూవీని చూశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వందల కోట్లు పెట్టి తీసిన సినిమాను విడుదలైన మరుసటి రోజే ఇలా పైరసీ చేయడం పట్ల మెగా అభిమానులు మరియు సినీ లవర్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. `పొంగల్ కి బస్ టికెట్ 5కే అంటే ఎందుకా అనుకున్న గేమ్ ఛేంజర్ మూవీకి కలిపి తీసుకున్నారా?` అని బస్సు ట్రావెల్స్ పై ప్రయాణికులు సెటైర్లు పేలుస్తున్నారు. మరి ఈ విషయంలో చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుంది అన్నది చూడాల్సి ఉంది.
View this post on Instagram