నవ్యాంధ్ర రాజధాని కడితే.. లక్షల మందికి ఉద్యోగాలు.. అసలు రాజధాని నిర్మాణం పూర్తికాకముందే.. నిర్మాణ సమయంలోనే వేలాది మందికి ఉపాధి, ఉద్యోగాలు లభిస్తాయి. ఇక, స్థానికంగా చిన్న చిన్న వ్యాపా రాలు జోరుగా పుంజుకుంటాయి. ఇక, రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది. తద్వారా.. మరింత మందికి ఉపా ధి, ఉద్యోగాలు ఎదురు వస్తాయి. ఇక, ఈ నిర్మాణం పూర్తయితే.. చెప్పడానికి కూడా మాటలు చాలవు. ఇది వాస్తవం. ఒక కొత్త నగరం ఏర్పడిన తర్వాత.. జరిగే పరిణామాలు అందరికీ తెలిసిందే.
అందుకే.. ప్రపంచ వ్యాప్తంగా.. అనేక దేశాల్లో కొత్త కొత్త నగరాలను సృష్టిస్తున్నారు. ఫలితంగా.. పెట్టు బడు లు వచ్చేందుకు కొత్త ఉద్యోగాలు సృష్టించేందుకు కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏపీలోనూ నవ్యాంధ్ర రాజధానిపై అనేక ఆశలు, ఆకాంక్షలు కూడా ఉన్నాయి. అయితే.. కలల రాజధానిపై అనేక రూపాల్లో అక్కసు వెళ్లగక్కుతూ.. ప్రతిపక్ష నాయకులు చేస్తున్న ప్రచారం.. రాస్తున్న లేఖలు వంటివి తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
“ఒక పని మనం చేయలేక పోవచ్చు. వారు చేస్తుంటే.. ముందే విమర్శలు ఎందుకు? చేశాక మాట్లాడదాం “ అని ఏపీ ఉమ్మడి అసెంబ్లీలో విపక్ష నేతగా ఉన్న మర్రి చెన్నారెడ్డి(తర్వాత సీఎం) చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. వైసీపీ నాయకులకు ఈ స్పృహ కూడా కనిపించడం లేదు. వారు అధికారంలో ఉన్నప్పుడు.. అమరావతిని పస్తు పెట్టి.. కుక్కలు చింపిన విస్తరి చేశారు. కానీ, ఇప్పుడు ఏదో అడుగులు ముందుకు పడుతుంటే.. అడుగు అడుగునా పుల్లలు పెడుతున్నారు.
ఇటీవలే ఓ `ఆగంతకుడు` ప్రపంచ బ్యాంకుకు లేఖ రాశాడు. ఏపీ రాజధాని అందరి అనుమతితో వచ్చిం దికాదని, రైతులను పీడించి భూములు తీసుకున్నారని పేర్కొన్నాడు. అందుకే రుణం ఇచ్చే ముందు ఆలోచించుకోవాలని కూడా సూచించాడు. ఇక, తాజాగా మరో విష ప్రచారం ప్రారంభమైంది. అమరావతి నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వానికి నిధులు అందడం లేదని.. ఈ క్రమంలో అమరావతి `సెస్సు` పేరిట ప్రజలపై భారాలు మోపేందుకురెడీ అయిందని.. ప్రచారం చేస్తున్నారు.
అంతేకాదు.. దీనిని వ్యతిరేకించాలని కొన్ని వార్తలు సోషల్ మీడియాలోనే కాకుండా.. ఓ వర్గం మీడియా లోనూ ప్రచారం అవుతున్నాయి. దీంతో ఏదో ఒక రకంగా.. అమరావతిపై భయ భ్రాంతులు.. అపోహలు పెల్లుబికేలా.. ప్రచారంలోకి వచ్చేలా కొన్ని వర్గాలు ముఖ్యంగా వైసీపీ వర్గాలు ప్రయత్నించడం ఇప్పుడు సర్వత్రా విస్మయాన్ని కలిగిస్తుండడం గమనార్హం.