కుటుంబ వివాదాల నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి మంచు ఫ్యామిలీ మీడియాలో నానుతున్న సంగతి తెలిసిందే. ఓవైపు మోహన్ బాబు, మంచు విష్ణు, మరోవైపు మంచు మనోజ్.. వీళ్ళ మధ్య గొడవలు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మంచు వారి ఇంటి రచ్చ పోలీసులు, కోర్టులు వరకు వెళ్లడమే కాకుండా ఒక ప్రముఖ మీడియా ఛానల్ ప్రతినిధికి గాయాలు కూడా అయ్యాయి. ఇలాంటి తరుణంలో మంచు మనోజ్ కు సంబంధించి ఓ న్యూస్ నెట్టింట గట్టిగా వైరల్ అయింది.
తాజా వివాదంతో మంచు మనోజ్ రాజకీయంగా బలపడాలని నిర్ణయం తీసుకున్నాడని.. త్వరలోనే భార్య భూమా మౌనిక తో కలిసి జనసేనలో చేరబోతున్నాడని సోమవారం ప్రచారం జరిగింది. కర్నూలు జిల్లా రాజకీయాల్లో భూమా ఫ్యామిలీకి గట్టి పట్టు ఉండటం, మెగా ఫ్యామిలీతో మంచి సంబంధాలు ఉండటంతో మంచు మనోజ్, మౌనిక దంపతులు జనసేనలో చేరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారని వార్తలు వచ్చాయి.
అయితే ఈ వార్తలపై మంచు మనోజ్ రియాక్ట్ అయ్యారు. సోమవారం తన అత్త శోభా నాగిరెడ్డి జయంతి సందర్భంగా మంచు మనోజ్ భార్య మౌనిక, కూతురు దేవసేన మరియు కొడుకుతో కలిసి ఆళ్లగడ్డ వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ` ఈరోజు మా అత్తయ్యగారు శోభ జయంతి. అందుకనే మొట్టమొదటిసారి నా కూతురు దేవసేన శోభను తీసుకుని ఆళ్లగడ్డ వచ్చాము. ఊర్లో ప్రతి ఒక్కరూ ప్రేమగా చూసుకున్నారు. అందరికీ ధన్యవాదాలు` అని మంచి మనోజ్ పేర్కొన్నాడు. ఇక ఈ క్రమంలోనే ఒక రిపోర్టర్ ` మీరు జనసేన లోకి వెళ్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.. దానిపై మీ అభిప్రాయం ఏంటి? ` అని ప్రశ్నించగా.. మంచు మనోజ్ ` నో కామెంట్స్ ` అంటూ నవ్వుతూ వెళ్ళిపోయాడు.