ఫుట్ బాల్ మ్యాచ్ అంటే.. ఆటగాళ్లకు స్ఫర్థ(పోటీ), వీక్షకులకు సంతృప్తి మిగలాల్చి. క్షణ క్షణం ఉత్కంఠ కు గురి చేస్తూ.. తమ దేశ ఆటగాళ్లు ఎలా చెలరేగుతారా? అని గ్రౌండ్లో నేరుగా వీక్షించేవాళ్లు.. ఇళ్లలో టీవీల ముందు కూర్చుని వీక్షించేవాళ్లు కూడా ఆనందంగా వీక్షిస్తారు. కానీ, గినియాలో మాత్రం ఇదు ఫుట్ బాల్ మ్యాచ్ రక్తసిక్తంగా మారింది. ఈ క్రీడలో ప్రత్యర్థి పక్షానికి చెందిన అభిమానుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో 100మందికి పైగా మృతి చెందారు. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫుడ్ బాల్ మ్యాచ్ అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
ఎందుకు?
గినియా దేశంలోని ఎన్జెరెకోర్ నగరంలో ఆదివారం ఫుట్‌బాల్ మ్యాచ్ నిర్వహించారు. గినియా ప్రస్తుత అధ్యక్షుడు జుంటా నాయకుడు మామాడి డౌంబౌయా గౌరవార్థం ఈ మ్యాచ్ నిర్వహించారు. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత.. అధ్యక్షుడికి సన్మానం చేసేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా జరిగాయి. అయితే ఆదివారం మ్యాచ్ జరుగుతున్న సమయంలో రిఫరీగా వ్యవహరిస్తున్న వ్యక్తి తీసుకున్న నిర్ణయాన్ని ప్రత్యర్థి ఆటగాళ్ల అభిమానులు తీవ్రంగా వ్యతిరేకించారు.
అప్పటి వరకు చాలా ఉత్కంఠగా సాగిన పోరు.. ఒక్కసారిగా ఉద్రిక్తతకు ఆ వెంటనే హింసకు దారితీసింది. దీంతో ఇరు జట్ల అభిమానులు మైదానంలోకి చొరబడి ఘర్షణ మొదలైంది. ఈ ఘర్షణ సందర్భంగా చోటు చేసుకున్న తోపులాట సహా .. పిడిగుద్దుల కారణంగా 100 మందికిపైగా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయా రు. వెంటనే స్పందించిన అధికారులు గ్రౌండ్‌ను మూసివేస్తున్నట్టు ప్రకటించారు. ప్రజలను అక్కడ నుంచి తరలించారు. మరోవైపు.. వేలాది మంది తీవ్రంగా గాయపడ్డారు.
మరోవైపు ఫుట్‌బాల్ గ్రౌండ్లో తలెత్తిన హింస నగరానికి కూడా పాకింది. ఎసెరెకోర్ నగరంలోని పోలీస్ స్టేషన్‌కు పలువురు దుండగులు నిప్పు పెట్టారు. దీంతో ప్రభుత్వం నగరంలో ఎమర్జెన్సీ విధించింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది. కాగా, ఈ ఘటనపై ప్రపంచ వ్యాప్తంగా ఆవేదన వ్యక్తమైంది. అమెరికా సహా పలు దేశాలు ఈ ఘటనలను ఖండించాయి.