సంక్షేమ పథకాల కంటే అభివృద్ధి పనులు, ఉపాధి కల్పన రాష్ట్ర భవితకు, పిల్లల భవిష్యత్తుకు ఎక్కువ మేలు చేస్తాయి. అయితే ప్రజలు వాటిని గుర్తించడం లేదు. అభివృద్ధిని పట్టించుకోవడం లేదు. తమ చేతికి గవర్నమెంటు నేరుగా ఏమిచ్చింది అనేదే చూస్తున్నారు.
అందుకే తెలుగుదేశం పార్టీ కూడా రూటు మార్చింది. 2023 ఎన్నికల కోసం తెలుగుదేశం కీలక కసరత్తు చేస్తోంది.
ఈ బాధ్యత మొత్తం లోకేష్ తీసుకున్నారు. ఇంతవరకు ఏ రాష్ట్రమూ ఇవ్వని కీలకమైన సంచలన హామీలు ఇవ్వాలని ప్రయత్నం చేస్తోంది. దాంతో పాటు అభివృద్ధి గురించి ప్రజలకు తెలిసేలా చేయడానికి ఒక ప్రణాళిక రచిస్తోంది.
ఇందులో భాగంగా రాష్ట్ర పరిస్థితులను అర్థం చేసుకోవడానికి లోకేష్ పలు ప్రత్యేక బృందాల సాయంతో ప్రత్యేక ప్రణాళిక తయారుచేస్తున్నారని తెలుస్తోంది.
ముందుగా ప్రభావిత వర్గాలను గుర్తించి… వారు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేస్తున్నారట. గత తెలుగుదేశం ప్రభుత్వం చేసిన ఒ కీలక తప్పును ఈసారి చేయకుండా ఉండేందుకు లోకేష్ రెడీ అయ్యారు.
ఆడపిల్ల కడుపులో ఉన్నపుడు నుంచి పెరిగి పెద్దయ్యే వరకు ప్రతి వయసులో ఆడపిల్లకు అండగా నిలిచే పథకాలు ప్రభుత్వం అమలు చేసినా జగన్ లాగ పెద్ద పెద్ద ప్రకటనలు ఇవ్వకపోవడంతో అవి జనాలకు గుర్తులేవు. కేవలం లబ్ధిదారులకు మాత్రమే అవి తెలుసు.
ఈసారి పథకాల రూపకల్పన వాటి ప్రచారం అన్నీ పక్కాగా ఉండేలా ప్లాన్ వేస్తున్నారట లోకేష్. అందులో భాగంగా ఇప్పటికే నిర్ణయించిన ఒక కీలక హామీ ఇపుడు లీక్ అయ్యింది.
రాష్ట్రంలో వివాహితులై, 5 ఎకరాల లోపు భూమి ఉండి… ప్రతి ఏడాది పంట వేసిన ప్రతి రైతుకు నెలకు రూ.5 వేలు పింఛను ఇవ్వాలని లోకేష్ నిర్ణయించారట. వ్యవసాయం తప్ప వేరే ఏ వ్యాపారం, ఉద్యోగం చేయని వారు అందరూ దీనికి అర్హులే. ఈ పథకం కింద ఏపీలో 50 లక్షల మంది లబ్ధిదారులు ఉంటారని అంచనా. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండో నెల నుంచి ఈ పథకం అమలు చేస్తామని హామీ ఇవ్వనున్నారు.
ఇది ఎలా లీకైందో గాని బయటకు వచ్చింది. నిజంగా లోకేష్ ఈ హామీ కనుక ఇస్తే కచ్చితంగా రైతులు గంపగుత్తగా టీడీపీ వైపు తిరిగే అవకాశం ఉంది. ప్రతినెలా 5 వేల పింఛను అంటే సామాన్యమైన విషయం కాదు. జగన్ పథకాలు అన్నింటిలో లబ్ధిదారులంతా కూడా ఇందులో సంఖ్యకు సమానం కాదు. అంత పెద్ద స్కీం ఇది.
ఒక్క హామీ లీకైతేనే ఇంత ఫైర్ ఉందంటే… మొత్తం లోకేష్ హామీలన్నీ బయటకు వస్తే వైసీపీ ఫీజులు ఎగిరిపోతాయేమో.