వైసీపీ హయాంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన విడదల రజిని ఇప్పుడు జగన్ కు బై బై చెప్పబోతున్నారా? అంటే అవునన్న మాటే వినిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని మూటగట్టుకున్న అనంతరం ఆ పార్టీలో కీలక నేతలంతా ఒక్కొక్కరిగా టీడీపీ, జనసేన, బీజేపీ లోకి జంప్ అవుతున్నారు. ఈ జాబితాలో విడదల రజని కూడా చేరబోతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఆమె వైసీపీకి రాజీనామా చేయనున్నారని వార్తలు వస్తున్నాయి.
విడుదల రజిని రాజకీయ ప్రస్థానం టీడీడీలో. పుట్టిన ప్రాంతానికి సేవ చేయాలనే సంకల్పంతో అమెరికా నుంచి తిరిగి వచ్చేసిన విడుదల రజిని.. చిలకలూరిపేట కేంద్రంగా విఆర్ ఫౌండేషన్ స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 2014లో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శిష్యురాలిగా టీడీపీలో చేరి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. నిత్యం ప్రజల్లో ఉంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడగల విడుదల రజినీ.. వైజాగ్ లోని మహానాడులో ప్రసంగించి చంద్రబాబు దృష్టిని ఆకర్షించారు.
2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించినప్పటికీ.. చంద్రబాబు అందుకు నిరాకరించారు. దాంతో వెంటనే వైసీపీలో చేరిన విడుదల రజిని.. చిలకలూరి పేట నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు పై 8301 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత జగన్ మొదటి విడత, రెండో విడతలోనూ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి అంకిత భావంతో పని చేశారు.
వైసీపీ యాక్టివ్ పాలిటిక్స్ లో కీలకంగా వ్యవహరించిన విడదల రజినీని మొన్నటి ఎన్నికల్లో చిలకలూరి పేట నుంచి కాకుండా గుంటూరు నుంచి పోటీ చేయించారు. పార్టీ ఓటమిలో భాగంగా ఆమె కూడా ఓటమి పాలయ్యారు. అప్పటినుంచి జగన్ ఆమెను పక్కన పెట్టేశారు. పైగా ఇటీవల బుల్లితెర నటి శ్యామలను పార్టీలో కీలక పదవి అప్పగించడం రోజా, విడుదల రజిని వంటి వారు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇక ఈ నేథ్యంలోనే తన రాజకీయ భవిష్యత్తు కోసం విడుదల రజిని పార్టీ మారాలని భావిస్తున్నారట. వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరాలని ఆమె ప్లాన్ చేస్తున్నారట. అందులో భాగంగానే ఇటీవల జనసేనలో చేరిన బాలినేని శ్రీనివాసరెడ్డి ద్వారా పవన్ను కలిసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారని ఇన్సైడ్ జోరుగా టాక్ నడుస్తోంది. అయితే ఇంతవరకు విడుదల రజినీ తన రాజీనామా విషయాన్ని ప్రకటించలేదు. అలా అని ఖండించనూ లేదు. అందువల్ల మరో వారం పది రోజుల్లో ఆమె పార్టీ మార్పుపై క్లారిటీ రావొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.