బిగ్ ఎక్స్పోజ్ అంటూ అధికార పార్టీ టీడీపీ, బిగ్ రివీల్ అంటూ విపక్షంలో ఉన్న వైసీపీ బుధవారం చేసిన ట్వీట్స్ ఏపీ పాలిటిక్స్ ను ఏ రేంజ్ లో హీటెక్కించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బిగ్ ఎక్స్పోజ్.. కమింగ్ ఆన్ 24 అక్టోబర్ 12 PM.. స్టే ట్యూన్డ్ అంటూ టీడీపీ ట్వీట్ చేసిన కొద్ది సేపటికే.. గెట్ రెడీ ఫర్ ద ట్రూత్ బోంబ్ అంటూ వైసీపీ ఓ ట్వీట్ వదిలింది.
వైఎస్ కుటుంబం ఆస్తుల వివాదం నేపథ్యంలో వైఎస్ జగన్కు.. వైఎస్ షర్మిల రాసిన లేఖను బిగ్ ఎక్స్పోజ్ అంటూ టీడీపీ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా బుధవారం సాయంత్రమే పోస్టు చేసింది. పది అంశాలతో వైఎస్ షర్మిల రాసిన ఈ లేఖ పెను సంచలనం రేపింది. వైఎస్ఆర్ ఆస్తుల పంపకాల విషయంలో అంతర్గతంగా ఏం జరిగిందో అందరికీ ఈ లేఖ ద్వారా కొంత క్లారిటీ వచ్చేసింది.
ఇక మరోవైపు బిగ్ రివీల్ అంటూ ఊరించిన వైసీపీ చివరకు తుస్సుమనిపించింది. `మీడియా ముసుగు వేసుకుని డ్రగ్స్ మాఫియాని నడిపేవారికి టీటీడీ ఛైర్మన్ పదవులా? గత కొన్నేళ్లుగా 15 మంది డ్రగ్స్ వినియోగదారులతో రెగ్యులర్గా వ్యవహారాలు నడుపుతూ దొరికిన ఎల్లో న్యూస్ ఛానల్ అధినేత.. సాక్ష్యాలివిగో` అంటూ కొన్ని పత్రాలను జతచేసి నేడు 12 గంటలకు ట్వీట్ చేసింది. కానీ చాలా వరకు ఆ పత్రాలను బ్లర్ అయ్యి ఉన్నాయి. తాము ఇచ్చిన సమాచారం వంద శాతం కరెక్ట్ అని వైసీపీ చెప్పలేకపోయింది. ఈ మాత్రం దానికి బిగ్ రివీల్ అంటూ వైసీపీ హంగామా చేయడం ఎందుకని ప్రజలు కొందరు ప్రశ్నిస్తున్నారు.
💣 Exposed 💣
మీడియా ముసుగు వేసుకుని డ్రగ్స్ మాఫియాని నడిపేవారికి టీటీడీ ఛైర్మన్ పదవులా?
గత కొన్నేళ్లుగా 15 మంది డ్రగ్స్ వినియోగదారులతో రెగ్యులర్గా వ్యవహారాలు నడుపుతూ దొరికిన ఎల్లో న్యూస్ ఛానల్ అధినేత.. సాక్ష్యాలివిగో!#YellowMediaDrugsMafia pic.twitter.com/1TDPqGtjsS
— YSR Congress Party (@YSRCParty) October 24, 2024