ఏపీలో గత ఐదేళ్లు ఆరాచక పాలనకు, అక్రమాలకు కేరాఫ్ గా నిలిచిన వైసీపీ ప్రభుత్వంపై, మాజీ సీఎం జగన్ పై తాజాగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ హయామంలో ఏనాడు శాంతి భద్రతలు పట్టించుకున్న దాఖలాలు లేవవని గొట్టిపాటి అన్నారు. ఏ ముఖ్యమంత్రి చేయనన్ని తప్పులు, దుర్మార్గపు పనులు గత ఐదేళ్లలో జగన్ చేశారని.. అందుకే ప్రజలు 11 సీట్లతో గట్టిగా బుద్ధి చెప్పారని గొట్టిపాటి రవికుమార్ ఎద్దేవ చేశారు.
అలాగే విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చేందుకు చంద్రబాబు ఎంతగానో కృషి చేస్తున్నారని.. గత టీడీపీ పాలనలో ఒక్కరూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని గొట్టిపాటి రవికుమార్ గుర్తుచేశారు. కానీ వైసీపీ ప్రభుత్వంలో పీపీఏలను రద్దు చేసి బయట నుంచి విద్యుత్ కొన్నారని.. నాడు వైసీపీ చేసిన తప్పుకు నేడు ప్రజలు భారం మోస్తూ బాధపడుతున్నారని గొట్టిపాటి అన్నారు.
కేంద్ర ప్రభుత్వానికి విద్యుత్ సంస్థలు వైసీపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశాయన్నారు. జగన్ తన అరాచక పాలనతో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు సర్వనాశనం చేశారని.. ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దెబ్బతీశారని గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు.ఐదేళ్లుగా కుంటిబడిన రాష్ట్ర అభివృద్ధి గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో కష్టపడుతున్నారని గొట్టిపాటి తెలిపారు.