మనిషన్నాక ఓ రేంజ్ ఉండాలి- ఇదొక సినిమా డైలాగ్. మరి మనిషికే రేంజ్ ఉంటే.. నాయకులకు ఇంకెం త రేంజ్ ఉండాలి! ఇదీ.. ప్రస్తుతం నేతల టాక్. పురుష నాయకులు ఎలా ఉన్నా.. మహిళా నాయకులు మాత్రం ప్రస్తుతం `రేంజ్` కోసం రగిలిపోతున్నారు. ఒకప్పుడు వైసీపీలో ఒకరిద్దరు ఉండేవారు. కంగాటి శ్రీదేవి, పోతుల సునీత(ఇటీవల రిజైన్ చేశారు), తానేటి వనిత వంటివారు.. రేంజ్ కోసం.. రోజూ కొట్టాడే వారు. ఇప్పుడు ఇదే పరిస్థితి టీడీపీకి కూడా వచ్చింది. ఈ పార్టీలోనూ మహిళా నాయకులు.. రేంజ్కోసం రగడలు పెట్టుకుంటున్నారు.
వీరిలో మంత్రి సవిత కూడా ఉన్నారన్నది ప్రధాన టాక్. ఇక, మిగిలినవారిని చూస్తే.. ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు, మరొకరు ఎమ్మెల్యే సతీమణి! వీరంతా కూడా.. తమ తమ నియోజకవర్గాల్లోనే కాకుండా.. సరిహద్దు నియోజకవర్గాల్లోనూ రేంజ్కోసం రెచ్చిపోతున్నారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న సంజీవరెడ్డిగారి సవిత.. పెనుకొండ నుంచి విజయం దక్కించుకున్నారు. మంత్రిగా యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఇదేసమ యంలో నియోజకవర్గంలో పట్టు కోల్పోకుండా.. టీడీపీ నాయకులపైనే పైచేయి కోసం ప్రయత్నం చేస్తు న్నారు.
దీంతో సొంత పార్టీలోనే పెనుకొండలో మంత్రి సవిత చుట్టూ వివాదాలు ముసురుకున్నాయని పార్టీలో చర్చసాగుతోంది. అయితే.. ఆమె ఎక్కువగా విజయవాడ, గుంటూరు జిల్లాల్లో పర్యటిస్తున్న నేపథ్యంలో సొంత నియోజకవర్గం వివాదాలు తెరమీదికి రాకుండా జాగ్రత్తలు పడుతున్నారు. ఇక, కర్నూలు జిల్లా ఆళ్ల గడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియారెడ్డి దూకుడు రోజుకోరకంగా వార్తల్లోకి వస్తోంది. ఆమెకు చెప్పి.. చెప్పి.. చంద్రబాబు అలిసిపోతున్నారే కానీ, ఆమె మాత్రం రేంజ్ కోసం ఆగడం లేదు.
ఇక, కడప ఎమ్మెల్యే.. తొలిసారిఇక్కడ విజయం దక్కించుకున్న మాధవీ రెడ్డి కూడా.. పైచేయి కోసం తపించి పోతున్నారు. ఇది జగన్ అడ్డా కావడం.. వైసీపీ నేతల హవా ఉండడంతో ఆమె రగిలిపోతున్నారు. వైసీపీ నాయకులపై తీవ్రస్థాయిలో రెచ్చిపోతున్నారు. వారి ఇళ్లను కూడా కూల్చి వేయించారు. దీనిని ఒక దశలో మంత్రినారాలోకేష్ అడ్డుకున్న పరిస్థితి కూడా ఉంది. అయినా.. మాధవీ రెడ్డి తగ్గడం లేదు. అధికారులను కూడా తన అజమాయిషీలో పెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక, నాలుగో నాయకు రాలు .. ఎమ్మెల్యే కాదు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి. ఈమె తానే ఎమ్మెల్యేని అంటూ.. రెచ్చిపోతున్నారు. “ఎన్నికల్లో ఎంత ప్రచారం చేశానో తెలుసుగా. మా ఆయన గెలుపు మా కటుంబం గెలుపు“ అని చెబుతూ.. అన్ని విషయాల్లోనూ తల దూరుస్తున్నారు. మీడియాపైనా చిందులు తొక్కుతున్నారు. మొత్తంగా వీరికి కావాల్సింది.. `రేంజ్`. మరి ప్రజలు ఏం చేస్తారో చూడాలి.