ఒకింత ఆశ్చర్యకరంగా.. విస్మయంగా ఉన్నప్పటికీ.. ఇది నిజమే. బాధితురాలైన 65 ఏళ్ల వృద్ధురాలు.. చేసి న విన్నపం మేరకు కోర్టు ఇలా నిర్ణయం తీసుకుంది. “నాపై జరిగిన రేప్. నాకు జరిగిన అన్యా యం ఈ సమాజానికి సంపూర్ణంగా తెలియాలి. అందుకే అసలు ఏం జరిగిందో పూర్తిగా ప్రజలు చూసేలా బహిరంగ విచారణ చేయండి“ అని 65 ఏళ్ల బాధిత మహిళ చేసిన విజ్ఞప్తి మేరకు కోర్టు ఈ నిర్ణయం తీసు కుంది. ఆమెపై 72 మంది చేసిన అత్యాచారం తాలూకు వీడియోలను కోర్టు బహిరంగ విచారణ సందర్భం గా ప్రసారం చేశారు. ఈ సందర్భంగా అందరూ ఆ వీడియోలను వీక్షించవచ్చని కోర్టు స్పష్టం చేసింది.
అసలేంటి? ఎక్కడ జరిగింది?
ఫ్రాన్స్‌కు చెందిన దంపతులు.. ప్రేమించుకుని కొన్ని దశాబ్దాల కిందటే ఒక్కటయ్యారు. ప్రస్తుతం భర్త వయసు 71 ఏళ్లు, భార్య వయసు 65 ఏళ్లు. అయితే.. ఎక్కడ దుర్భుద్ధి పుట్టిందో ఏమో.. భర్తకు భార్యపై పెను దుర్భుద్ధి పుట్టింది. ఆమెపై వికృత చేష్ఠల ద్వారా ఆనందం పొందుతున్నాడు. గత 10 ఏళ్లుగా అంటే.. (అప్పట్లో భార్యకు 50 ఏళ్లు ఉంటాయి.) ఆమెను లైంగికండా వేధిస్తున్నాడు. ఇది ఆమెకు తెలియకుండా జాగ్రత్తలు పడుతున్నాడు.
రాత్రివేళల్లో ఆహారం, పానీయాల్లో మత్తు మందు కలిపి ఇస్తూ.. ఆమె అపస్మారక స్థితికి చేరుకున్నాక.. తనకు తెలిసిన వారిని ఇంటికి పిలిచి.. సొంత భార్యపైనే అత్యాచారం చేయిస్తున్నాడు. వీటిని యథాలాపంగా వీడియోలు తీస్తున్నాడు. ఇలా.. 2011-2020 మధ్య 96 సార్లు 72 మంది యువకులు, మధ్య వయస్కులతో తన భార్యపై అత్యాచారం చేయించాడు. మత్తు వదిలిన తర్వాత.. భార్యకు లేనిపోని మాటలు చెప్పి.. ఏమీ జరగలేదని నమ్మించేవాడు.
ఎలా బయట పడింది?
మహిళలను లైంగికంగా చూడాలన్న కాంక్షతో 2020లోనే ఆ ప్రబుద్ధుడు ఓ షాపింగ్ మాల్లో తమను తాము మైమరి వస్తువులు కొనుగోలు చేస్తున్న మహిళలను టార్గెట్ చేసుకుని వీడియోలు తీయడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని పసిగట్టిన షాపింగ్ మాల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫ్రాన్స్ చట్టాల ప్రకారం.. వృద్ధుడిని విచారించగా.. ఆయన ఫోన్ సహా ఇంట్లో పదుల సంఖ్యలో ఉన్న కెమెరాల్లో సాక్షాత్తూ కట్టుకున్న భార్యకు సంబంధించిన బాగోతం అంతా బయట పడింది.
ఈ కేసు అప్పటి నుంచి విచారణలోనే ఉంది. తాజాగా బలమైన ఆధారాల కోసం వీడియోలను పరిశీలించా లని కోర్టు పేర్కొనగా.. బాధితురాలైన 65 ఏళ్ల మహిళ ఓకే చెప్పడంతోపాటు.. వీటిని బహిరంగంగానే చూపించాలని.. తన సమస్య అందరికీ తెలియాలని.. మహిళలు భవిష్యత్తులో మోస పోకుండా ఉండేందుకు ఈ ఘటనలు స్ఫూర్తిగా నిలుస్తాయని ఆమె పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఫ్రాన్సు కోర్టు బహిరంగ విచారణలో పైవిధంగా ఆదేశాలు జారీ చేసింది. అయితే.. కోర్టులో ఆ సమయంలో ఉన్నవారికి మాత్రమే ఈ వీడియోలు చూసేందుకు అవకాశం కల్పించింది.