• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

కూటమి ప్రభుత్వంలో శరవేగంగా రాష్ట్రాభివృద్ధి , అన్నివర్గాలకు సమన్యాయం చంద్రబాబు ధ్యేయం!

అమెరికా న్యూ జెర్సీలో 'ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు'!!

admin by admin
October 6, 2024
in Around The World, NRI, Trending
0
0
SHARES
109
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

కూటమి ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి శరవేగంగా జరుగుతుందని ‘ఏపీ శాసన స్పీకర్ అయ్యన్న పాత్రుడు’ ఆశాభావం వ్యక్తం చేశారు.

రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సారధ్యంలోని కూటమి ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు.

న్యూ జెర్సీ లోని ఫైవ్ స్పైస్ ప్యాలస్ లో అయ్యన్న తో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని న్యూ జెర్సీ కూటమి నేతలు ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎన్ ఆర్ ఐ లు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన ఉల్లాసంగా సమాధానాలు ఇచ్చారు.

ఏదైనా కొత్త ప్రభత్వం ఏర్పడిన ఏడాది కాలానికి గాని ప్రజల్లోకి వెళ్లే ధైర్యం చేయరని, కాని కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనలోనే ఎంతో అభివృద్ధి సాధించి ధైర్యంగా ప్రజల ముందుకు వచ్చిందన్నారు.

స్వర్ణాంధ్ర-2047 లక్ష్యసాధనలో ఎన్ఆర్ ఐ లు భాగస్వామ్యమై ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

విభజన గాయాల నుంచి కోలుకునే దశలో మాజీ సీఎం జగన్‌ చేసిన విధ్వంసం నుంచి బయటపడడానికి సర్వశక్తులూ కూడగట్టుకొని సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని గదిలో పెట్టేందుకు పనిచేస్తున్నారని చెప్పారు.

ప్రభుత్వ పథకాలు, ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధిధ్యేయం గా ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాచరణ రూపొందించారని వెల్లడించారు.

తాను ఎన్టీఆర్ డిస్కవరీ అని అయ్యన్న చెప్పుకున్నారు.

ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి తనలాంటి వారిని ఎంతో మందిని తెచ్చారని అలా తనకు కూడా చిన్న వయసులోనే రాజకీయ బిక్ష పెట్టింది ఎన్టీఆర్ అని అయ్యన్న గతాన్ని నెమరేసుకున్నారు.

తాను టీడీపీలో ఈ రోజు ఉన్నాను అంటే అది ఎన్టీఆర్ దయ అని క్రెడిట్ అంతా పెద్దాయనకు ఇచ్చేసారు.

ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినపుడు ఎంతో మంది ఆయనని విమర్శించారని రాజకీయాల్లో ఆయన రాణించరు అని కూడా అన్నారని.. కానీ తాను ఎన్టీఆర్ సక్సెస్ అవుతారని ఊహించాను అని కూడా అయ్యన్న అన్నారు.

ఏపీలో కూటమి కి మద్దతు పలికిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమ నిర్వాహకులను అభినందించారు.

రాజ కసుకుర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రామకృష్ణ వాసిరెడ్డి వందన సమర్పణ చేశారు.

ఈ కార్యక్రమంలో న్యూ జెర్సీ కూటమి నేతలు సతీష్ మేకా, నాయుడు ఈర్ల, హరి ముత్యాల, శ్రీహరి మందాడి, రమేష్ నూతలపాటి, జగదీష్ యలమంచలి, శ్రీనివాస్ ఓరుగంటి, లక్ష్మి దేవినేని, హరి తుమ్మల, రమణ గన్నే , రవి వట్టికూటి, వంశీ వెనిగండ్ల పాల్గొన్నారు.

Tags: Chandrababu's mission is speedy development of the state and equality for all communities in the coalition government!
Previous Post

ఓ మ‌హిళ‌పై 72 మంది రేప్..కోర్టులో వీడియోలు టెలికాస్ట్

Next Post

మృత్యువుతో పోరాడుతున్న అభిమాని.. చివ‌రి కోరిక తీర్చిన చంద్ర‌బాబు

Related Posts

Andhra

నందిగం సురేష్ పై మరో కేసు..అరెస్ట్

May 19, 2025
Movies

మాస్ట‌ర్ భ‌ర‌త్ ఇంట తీవ్ర విషాదం..తల్లి హఠాన్మరణం!

May 19, 2025
Andhra

విజయవాడ సబ్‌ జైలు.. క్యూ క‌డుతున్న వీఐపీలు..!

May 19, 2025
Movies

ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!

May 19, 2025
Movies

వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?

May 18, 2025
Around The World

ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!

May 17, 2025
Load More
Next Post

మృత్యువుతో పోరాడుతున్న అభిమాని.. చివ‌రి కోరిక తీర్చిన చంద్ర‌బాబు

Latest News

  • అఫీషియ‌ల్‌.. ప్ర‌ముఖ హీరోయిన్‌తో విశాల్ పెళ్లి..!
  • నందిగం సురేష్ పై మరో కేసు..అరెస్ట్
  • టీడీపీ వ‌ర్సెస్ జ‌న‌సేన‌.. ప‌ద‌వి కోసం ఫైట్స్‌..!
  • మాస్ట‌ర్ భ‌ర‌త్ ఇంట తీవ్ర విషాదం..తల్లి హఠాన్మరణం!
  • విజయవాడ సబ్‌ జైలు.. క్యూ క‌డుతున్న వీఐపీలు..!
  • వావ్.. మణిరత్నం దర్శకత్వంలో పొలిశెట్టి?
  • ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!
  • మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?
  • కేసుల దెబ్బకు ఫారెన్ వెళ్తున్న వైసీపీ నేత
  • వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?
  • అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!
  • ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!
  • ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!
  • ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!
  • ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra