వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్న జగన్ ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని ఆమె వ్యాఖ్యానించారు. తిరుమ లకు అన్యమతస్థులు వెళ్లినప్పుడు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని.. ఈ నియమాన్ని అంద రూ పాటించాల్సిందేనని చెప్పారు. దీనికి జగన్ మాత్రం అతీతులా? అని షర్మిల ప్రశ్నించారు.
తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ కల్తీ అయిన మాట వాస్తవమేనని షర్మిల చెప్పారు. ఈ విషయంలో సందే హం అవసరం లేదని.. ల్యాబు రిపోర్టులు కూడా ఇదే చెబుతున్నాయన్నారు. ప్రసాదానికి వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందన్నది వాస్తవమేనన్నారు. దీనిపై మరింత లోతుగా పరిశీలన చేసి.. బాధ్యులను గుర్తించాలని డిమాండ్ చేశారు. బాధ్యులను ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని షర్మిల పేర్కొన్నారు.
తిరుపతి శ్రీవారం లడ్డూ ప్రసాదం కల్తీ ఘటన పై తాను పీసీసీ చీఫ్ హోదాలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తికి లేఖ రాసినట్టు తెలిపారు. లడ్డూ కేసును సుమోటోగా తీసుకుని విచారించాలని కోరినట్టు షర్మిల తెలిపారు. ఇది యావత్ హిందూ సమాజానికి సంబంధించిన అంశంగానే చూడాలని ఆమె సూచించారు. కేవలం తిరుమలకే పరిమితం కాలేదని.. దేశవ్యాప్తంగా ఉన్న హిందువవుల మనోభావాలకు సంబంధించిన విషయమని ఆమె వ్యాఖ్యానించారు.