జగన్ హయాంలో దేవాలయాలు, దేవుళ్ల విగ్రహాలు, రథాలపై దాడులు పెరిగాయన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. జగన్ సీఎంగా ఉన్నపుడు ఏపీలో క్రిస్టియానిటీ, అన్య మత ప్రచారం ఎక్కువయిందన్న విమర్శలు వచ్చాయి. జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట మసకబారిందని, కోట్లాదిమంది హిందువులు పవిత్రంగా భావించే తిరుమల కొండపై అన్యమత ప్రచారం జోరుగా సాగుతోందని ఆరోపణలు వచ్చాయి.
తిరుమలలో లడ్డూతోసహా ఆహారంలో నాణ్యత లోపించిందని భక్తులు, హిందూ సంఘాలు పలుమార్లు ఆరోపించాయి. ఈ క్రమంలోనే తాజాగా తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందనన్న ఆరోపణలు రావడం సంచలనం రేపింది. ఈ నేపథ్యంలోనే జగన్ ముఖ్యమంత్రిగా పాలన చేపట్టింది మొదలు ఇప్పుడు లడ్డూ వివాదం వరకు హిందూమతంపై జరిగిన దాడి క్రమంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.
https://x.com/manishini9/status/1836965922604482851