పెళ్లి…పెళ్లంటే పందిళ్లు, తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు.. మూడే ముళ్లు.. ఏడే అడుగులు.. మొత్తం కలిపి నూరేళ్లు.. అన్నాడో సినీ కవి! కానీ, అది సామాన్యుల పెళ్లిళ్ల సంగతి. రిచ్చాతిరిచ పీపుల్ పెళ్లిళ్లు అంత సింపుల్‌గా జరగవు! ఆకాశం దిగి వచ్చి.. మబ్బులతో పందిరేసేంత గ్రాండ్ ముచ్చట! ఊరంతా.. ఆమాటకొస్తే ప్రపంచమంతా చెప్పుకొనే ముచ్చటగా జరిగే వేడుక. సామాన్య జనాల పెళ్లికి మహా అయితే ప్రీ-వెడ్డింగ్ ఫొటోషూట్లు మాత్రమే జరుగుతాయి.
అదే రిచ్చోళ్ల పెళ్లికి ప్రీవెడ్డింగ్ వేడుకలే నాలుగైదుసార్లు జరుగుతాయి. ఆర్నెల్లుగా ఒక సాగాలాగా సాగుతున్న అనంత అంబానీ పెళ్లి ముచ్చటే ఇందుకు ఉదాహరణ. ఈ పెళ్లికి రూ.1500 కోట్లు ఖర్చయిందని కొందరు.. కాదు రూ.5000 కోట్లు ఖర్చు పెట్టారని ఇంకొందరు.. ఇలా రకరకాలుగా చెబుతున్నారు. ఎవరు చెప్పినా మినిమం రూ.1500 కోట్లకు తగ్గలేదనడానికి కళ్ల ముందు కనిపిస్తున్న ఖర్చే సాక్ష్యం. అయితే.. మనదేశంలో ఓ వెడ్డింగ్ వేడుక ఇంత గ్రాండ్‌గా జరగడం ఇదే మొదటిసారి కాదు. ఇలాంటివి మరికొన్నీ ఉన్నాయి. ఆ లెక్కలేంటో చూద్దాం రండి..
ఈషా-ఆనంద్ పిరమల్..
పెళ్లి: 2018; ఖర్చు: రూ.700 కోట్లు
అనంత అంబానీ అక్క.. ముకేశ అంబానీ, నీతా దంపతుల గారాలపట్టి.. ఈషా అంబానీ పెళ్లి పిరమల్ గ్రూపు యువరాజు ఆనంద్ పిరమల్‌తో 2018 డిసెంబరు 12న జరిగింది. పెళ్లికి ఆమె ధరించిన లెహంగా ఖరీదే ఏకంగా రూ.90 కోట్లు! వెడ్డింగ్ కార్డు ఒక్కొక్కటీ రూ.3 లక్షలు. వీరి పెళ్లికి అయిన ఖర్చు దాదాపుగా రూ.700 కోట్లని అంచనా.
సుశాంతోరాయ్-రిచా అహూజా
సీమాంతోరాయ్-చాందినీతూర్
పెళ్లి: 2004; ఖర్చు: రూ.554 కోట్లు
భారతదేశంలోని వ్యాపార దిగ్గజాల్ల ఒకరైన దివంగత సుబ్రతారాయ్ కుమారులు సుశాంతోరాయ్, సీమాంతోరాయ్ వివాహాలను రిచా అహూజా, చాందినీతూర్తో ఒకే వేదికపై జరిపించారు. 2004లో జరిగిన ఈ పెళ్లికి 11 వేల మంది అతిథులు వచ్చారు. తన కుమారుల పెళ్లిళ్లతోపాటు.. 101 మంది పేద ఆడపిల్లలకు సుబ్రతారాయ్ తన ఖర్చుతో పెళ్లి చేయించారు. 15 వేల మంది పేదలకు పెళ్లి భోజనాలు పెట్టారు. అప్పట్లో ఈ వేడుకలన్నింటికీ కలిపి అయినఖర్చు రూ.554 కోట్లు. 2004లో రూ.554 కోట్లంటే.. వాస్తవానికి ద్రవ్యోల్బణం లెక్కల్ని కూడా సరిపోలిస్తే ఇప్పటి అనంత అంబానీ పెళ్లికి అయిన ఖర్చుతో సమానమని చెప్పుకోవచ్చేమో!!
బ్రాహ్మణిరెడ్డి-రాజీవ్ రెడ్డి
పెళ్లి: 2016; ఖర్చు: రూ.500 కోట్లు
తెలుగువారెవరూ మర్చిపోలేని ఖరీదైన పెళ్లి.. మైనింగ్ బ్యారన గాలి జనార్దన రెడ్డి కుమార్తె బ్రాహ్మణి-రాజీవ్‌రెడ్డి వివాహం. 2016లో జరిగిన ఈ పెళ్లికి దాదాపు రూ.500 కోట్లు ఖర్చయిందని అంచనా. ఈ పెళ్లికి గాలి జనార్దన రెడ్డి 50 వేల మందిని ఆహ్వానించినట్లు అప్పట్లో కథలుకథలుగా చెప్పుకొన్నారు.
సృష్టి మిత్తల్-గుల్రాజ్ బెహల్
పెళ్లి: 2013; ఖర్చు: రూ.500 కోట్లు
స్టీల్ టైకూన ప్రమోద్ మిత్తల్ కుమార్తె సృష్టి మిత్తల్ పెళ్లి.. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ గుల్రాజ్ బెహల్‌తో 2013లో అట్టహాసంగా జరిగింది. మూడురోజులపాటు స్పెయినలో నిర్వహించిన ఈ వెడ్డింగ్ వేడుకలకు అయిన ఖర్చు అక్షరాలా రూ.500 కోట్లు.
వనీషా మిత్తల్-అమిత భాటియా
పెళ్లి: 2004; ఖర్చు: రూ.240 కోట్లు
ప్రపంచప్రసిద్ధి గాంచిన ఉక్కు వ్యాపారి.. లక్ష్మీ మిత్తల్ కుమార్తె వనీషా వివాహం లండన బ్యాంకర్ అమిత భాటియాతో 2004లో ప్యారిస్‌లో జరిగింది. మొత్తం ఆరు రోజులపాటు జరిగిన ఈ వివాహ వేడుకలకు అయిన ఖర్చు రూ.240 కోట్లు.
సంజయ్ హిందూజా-అను మహ్తానీ
పెళ్లి: 2015; ఖర్చు: రూ.150 కోట్లు
ప్రముఖ వ్యాపారవేత్త సంజయ్ హిందూజా.. తన చిరకాల గర్ల్‌ఫ్రెండ్ అను మహతానీని 2015లో వివాహం చేసుకున్నాడు. ఉదయ్‌పూర్‌లో జరిగిన ఈ వేడుకకు.. జెన్నిఫర్లోపెజ్ వచ్చి పెర్ఫామ్ చేసింది. ఈ పెళ్లికి అయిన ఖర్చు దాదాపు రూ.150 కోట్లు అని అంచనా.
సోనమ్ వాస్వానీ-నవీన ఫాబియానీ
పెళ్లి: 2017; ఖర్చు: రూ.210 కోట్లు
స్టాలిన గ్రూప్ వ్యవస్థాపకుడు సునీల్ వాస్వానీ కుమార్తె సోనమ్ వాస్వానీ వివాహం.. 2017లో నవీన ఫాబియానీతో అయింది. ఆసి్ట్రయాలోని వియెన్నాలో వీరి వివాహ వేడుకలు జరిగాయి. వీటికైన ఖర్చు రూ.210 కోట్లు.
విరాట్ కోహ్లీ- అనుష్కశర్మ
పెళ్లి: 2017; ఖర్చు: రూ.100 కోట్లు
ఏస్ ఇండియన క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన అనుష్క శర్మ వివాహం ఇటలీలోని లేక్ కోమోలో 2017లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లికి అయిన ఖర్చు దాదాపు రూ.100 కోట్లని అంచనా.