ఢిల్లీ లిక్కర్ స్కాం నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కొద్ది నెలల క్రితం అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కేజ్రీవాల్ బెయిల్ పై బయటకు వచ్చారు. ఆ తర్వాత మరో మారు ఆయన జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి అయిన బెయిల్ పై బయటకు వచ్చి సంచలన ప్రకటన చేశారు. మరో రెండు రోజుల్లో తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు.
ఆ తర్వాత కీలక నేతలతో ఉన్న స్థాయి సమావేశం నిర్వహిస్తానని, అందులో ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రి పేరును ప్రకటిస్తామని చెప్పారు. మహారాష్ట్రతో పాటు ఢిల్లీలో కూడా నవంబర్ లో ఎన్నికలు నిర్వహించాలని కోరతానని అన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో మరోసారి పోటీ చేస్తానని, తాను నిర్దోషి అని ప్రజలు భావిస్తే తమ పార్టీకి ఓటు వేయమని అడుగుతానని కేజ్రీవాల్ ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలపై చర్చించిన కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అరెస్టు అయి జైలుకు వెళ్లినా సరే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవద్దని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేజ్రీవాల్ సూచించారు. పార్టీతో పాటు ప్రభుత్వంలో కూడా నెంబర్ టు గా కొనసాగుతున్న మనీశ్ సిసోడియాను మళ్ళీ కేబినెట్ లోకి తీసుకోవడమే మొదటి ప్రాధాన్యతగా ఉంటుందన్నారు. తాను, నిజాయితీపరుడు అనుకుంటే ప్రజలు తనకు ఓటు వేస్తారనిల ధీమా వ్యక్తం చేశారు.