ఏపీలో నిరుపేదలకు 5 రూపాయలకే రుచికరమైన భోజనం పెట్టే అన్న క్యాంటీన్లు కూటమి సర్కార్ మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చింది. నేడు గుడివాడ మునిసిపల్ పార్క్లో సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి చేతుల మీదగా తొలి అన్న కాంటీన్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా టీడీపీ నేతలు, అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు.
అన్న క్యాంటీన్ ను ఓపెన్ చేసిన అనంతరం చంద్రబాబు దంపతులు స్వయంగా భోజనం వడ్డించారు. ఆపై టోకెన్ తీసుకుని మరీ పేదలతో కలిసి భోజనం చేశారు. సీఎం అయిన తానూ సామాన్యుడినే అని చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారు. అలాగే అక్కడికి వచ్చిన ప్రజలతో చంద్రబాబు కాసేపు ముచ్చటించారు. వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అన్న క్యాంటీన్లు పునఃప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇన్నేళ్ళ రాజకీయ జీవితంలో నాకు సంతృప్తినిచ్చే కార్యక్రమం ఈ అన్న క్యాంటీన్ అని.. కడుపు నిండా భోజనం పెట్టటం కంటే, ఏదీ ఎక్కువ కాదని చంద్రబాబు పేర్కొన్నారు. ఒక దుర్మార్గుడి వల్ల అన్న క్యాంటీన్లు మళ్ళీ ప్రారంభించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఇదే గుడివాడలో పుట్టిన అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో, డొక్కా సీతమ్మ గారిని ఆదర్శంగా తీసుకుని అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతలో 100 అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తెలుస్తున్నారు. గురువారం గుడివాడలో క్యాంటీన్ ఓపెన్ అవ్వగా.. మిగతా 99 క్యాంటీన్లను శుక్రవారం ప్రారంభించనున్నారు.
గుడివాడలో అన్న క్యాంటీన్ ను ప్రారంభించిన తరువాత, ప్రజలతో కలిసి భోజనం చేసిన చంద్రబాబు గారు, భువనేశ్వరి గారు. ప్రజల బాగోగులు అడిగి తెలుసుకున్న చంద్రబాబు గారు.#AnnaCanteensOnceAgain#NaraChandrababuNaidu#AndhraPradesh pic.twitter.com/A0NtpEgN5o
— Telugu Desam Party (@JaiTDP) August 15, 2024