కేవలం రూ.5కే పేదవాడి కడుపు నింపడం కోసం ఏపీలో కూటమి ప్రభుత్వం మళ్ళీ అన్న క్యాంటీన్ లను అందుబాటులోకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రేపు అన్న కాంటీన్లు ప్రారంభం కాబోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 203 అన్న క్యాంటీన్లు కాగా.. ప్రస్తుతం 180 సిద్ధమయ్యాయి. తొలి విడతలో 100 అన్న కాంటీన్లను స్టార్ట్ చేయబోతున్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా తొలి అన్న క్యాంటీన్ తెరుచుకోబోతోంది.
మిగిలిన 99 క్యాంటీన్లను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఆయా నియోజకవర్గాల్లో ప్రారంభించనున్నారు. అలాగే సెప్టెంబర్ 5న మరో 99 క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇకపోతే అన్న క్యాంటీన్లలో ఆహార పదార్థాల తయారీ, సరఫరా బాధ్యతలు హరేకృష్ణ మూవ్మెంట్ సంస్థ దక్కించుకుంది.
మెనూ అండ్ టైమింగ్స్ ను పరిశీలిస్తే.. ఆదివారం మినహా వారంలో ఆరు రోజులు అన్న క్యాంటీన్లు రన్ అవుతున్నాయి. రూ. 5 కే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రికి డిన్నర్ అందిస్తారు. టిఫిన్ ఉదయం 7.30 నుంచి 10 గంటల మధ్య అందుబాటులో ఉంటుంది. మధ్యాహ్న భోజనం 12.30 నుంచి 3 గంటల మధ్యలో ఏర్పాటు చేస్తున్నారు. రాత్రి భోజనం 7.30 నుంచి 9 గంటల మధ్య అందిస్తారు. ఇక సోమవారం నుంచి శనివారం వరకు అన్న క్యాంటీన్ల మెనూ వివరాలు కింద ఫోటోలో ఉన్నాయి.. దానిపై కూడా ఓ లుక్కేయండి.