ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సైలెంట్‌గా ఉంటారు. కానీ, ఆయన తనను వ్యతిరేకించే వారంటే వైలెంట్ గానే ఉంటారనే విషయం తెలిసిందే.దీనికి బీజేపీ నేతలే మినహాయింపు కాదు. ఆయనను వ్యతిరేకించిన అనేక మంది కమల నాథులకు టికెట్లు కూడా దక్కని విషయం తెలిసిందే. ఇక, దక్కినా.. వారికి ప్రభుత్వం లో ప్రాధాన్యం లేదు. ఒక్క నితిన్ గడ్కరీ మాత్రం ఆర్ ఎస్ ఎస్ అండతో నెట్టుకువస్తున్నారు. అలాంటి మోడీకి తన పార్టీ కాని వారంటే మరీ మంట.
అందుకే గత పదేళ్లుగా మోడీపై వ్యతిరేక గళం వినిపించిన ప్రతి ఒక్కరిపైనా కేసులు పెట్టించారు. కారణా లు ఏవైనా కూడా కేసుల్లో చిక్కుకున్నారు. ఢిల్లీ సీఎం లిక్కర్ కుంభకోణంలో జైల్లోనే ఉన్నారు. కేసీఆర్ తనయ కూడా ఇదే కేసులో ఉన్నారు. వీటికి కారణాలు అందరికీ తెలిసిందే. ఇక, రాహుల్‌పైనా కేసు ఉన్న విషయం.. శిక్ష పడిన విషయంకూడా తెలిసిందే. అలాంటిది జగన్ తోక ఝాడిస్తే.. మోడీ ఊరుకుంటారా? ప్రస్తుతం ఆయనతో అవసరం(రాజ్యసభలో) ఉంది కాబట్టి.. మౌనంగా ఉంటున్నారట.
కానీ, కమల నాథులు చెబుతున్న లెక్కల ప్రకారం.. జగన్‌పై మోడీ గుర్రుగా ఉన్నారని.. దీనికి ఏకంగా 4 కారణాలు ఉన్నాయని అంటున్నారు. 1) ఎన్నికలకు ముందు తమతో పొత్తుకు నిరాకరించారు. దీంతో జగన్‌ను చిత్తుచిత్తుగా ఓడించారనేది వారి మాట. 2) తనను వ్యతిరేకించే పక్షాలను చేరదీసి.. ఢిల్లీలో ధర్నా నిర్వాహించడం. 3) తనను వ్యతిరేకించే వారికి మరిన్ని ఆయుధాలు ఇచ్చేలా వ్యవహరించడం. 4) ఎన్డీయే కూటమిని హెచ్చరిస్తున్నట్టుగా సంకేతాలు పంపించడం.
ఈ నాలుగు కారణాలపైనా మోడీ చాలా సీరియస్‌గా ఉన్నారనేది బీజేపీ నేతల మాట. కానీ, ఇప్పటికిప్పుడు జగన్‌ను కదిలించకపోయినా.. త్వరలోనే రాజ్యసభలో బీజేపీ బలం పుంజుకునే అవకాశం లేదా కూటమి పార్టీల బలం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో జగన్ అవసరం తమకు ఉండదు. అప్పుడు మోడీ సరైన సమయంలో జగన్‌ను ఇరికించేయడం ఖాయమని అంటున్నారు. ఈ కారణాలతోనే ఇటీవల అప్పాయింట్ మెంటు అడిగినా.. ఇవ్వలేదని చెబుతున్నారు. మరి ఇది నిజమేనా.. అయితే.. ఏం చేస్తారనేది చూడాలి.