ఇప్పుడు అందరి ఆలోచన.. అందరిచర్చా కూడా ఇదే. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రెండు రోజుల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుంది. అదేవిధంగా ఉభయ సభలు కూడా సమావేశమవుతాయి. అనంతరం.. బడ్జెట్ ప్రసంగం ఉండనుంది. అయితే.. ఇది ఇంటీరియమా? లేక.. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెటా? అనేది కూడా సందిగ్ధంగానే ఉంది. సరే.. ఎలా చూసుకున్నా.. బడ్జెట్ అయితే ప్రవేశ పెడతారు.
అయితే.. సభలో తొలి రెండు రోజులు కూడా.. ఈ కార్యకలాపాలే సరిపోతాయి. అనంతరం.. సీఎం చంద్ర బాబు శ్వేతపత్రాలను రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే విడుదల చేసినవాటిపైచర్చ పెట్టనున్నారు. అదేవిధంగా మిగిలిన ఆర్థిక శాఖ, ఆరోగ్య శాఖలకు సంబంధించిన శ్వేత పత్రాలను సభలోనే ప్రవేశ పెట్టాలని చంద్రబాబు నిర్ణయానికి వచ్చారు. సో.. తొలి మూడు రోజులు కూడా ఈ కార్యక్రమాలకే సరిపోతా యి. అయితే.. ప్రశ్నోత్తరాల సమయం యథాతథంగా ఉండనుంది.
వీటిలో సభ్యులు అడిగే ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇస్తారు. మొత్తంగా చూస్తే.. వైసీపీకి దక్కే సమయం ఎంత? ఇటు ప్రశ్నోత్తరాలైనా.. అటు చర్చలైనా ఎంత సమయం ఉంటుంది? ఇంకా ఏయే సందర్భాల్లో వైసీపీకి మాట్లాడే అవకాశం కల్పిస్తారు? అనేది ఆసక్తిగా మారింది. ఈ లెక్క ప్రకారం చూస్తే.. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగే ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇస్తారు. ఇది అందరికీ కామన్. కాబట్టి వైసీపీ సభ్యులకు కూడా ఇది లభిస్తుంది.
ఇక, చర్చల విషయానికి వస్తే.. మాత్రం అందరూ మాట్లాడిన తర్వాత.. సంఖ్యా పరంగా సభ్యులకు అవకా శం ఇస్తారు. దీనిలో జగన్ వాడుకుంటారా? లేక.. పెద్దిరెడ్డి వంటివారు వాడుకుంటారా? అనేది సభకు అనవసరం. కేటాయించిన సమయంలోనే సభలో మాట్లాడాల్సి ఉంటుంది. మొత్తంగా చూస్తే.. సభలో చర్చలకు వైసీపీకి దక్కే సమయం చాలా స్వల్పం. అయితే.. ఇక్కడ `పాయింట్ ఆఫ్ ఆర్డర్`లో మాత్రం.. వైసీపీకి ఛాన్స్ దక్కనుంది. దీనిని వినియోగించుకునే అవకాశం వైసీపీకి ఉంది. ఇంతకు మించి ప్రత్యేకంగా సభలో వైసీపీకి ఎలాంటి సమయం దక్కదు.