తిరుపతి పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో అధికార పార్టీ వైసీపీ నేతలు.. ఇతర ప్రాంతాల నుంచి ప్రజలను తరలించి.. దొంగ ఓట్లు వేయించారని.. ప్రతిపక్షాలు సాక్ష్యాధారాలతో సహా గుర్తించి.. మీడియా ముందుకు తీసుకువచ్చిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక, మరో అడుగు ముందుకు వేసిన టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి.. సూళ్లూరుపేట నియోజకవర్గంలోనూ ఇదే తరహా దొంగ తతంగం జరిగిందని ఆరోపిస్తున్నారు. ఇక, తిరుపతి విషయంలో ఒక్క వైసీపీ మినహా అన్ని పార్టీలదీ ఒకే మాటగా ఉంది.
తిరుపతి అసెంబ్లీ పరిధిలో జరిగిన పార్లమెంటు ఉప ఎన్నికలో దొంగ ఓట్లు పడ్డాయని.. సో.. దీనిని రద్దు చేసి.. తిరిగి ఇక్కడ బైపోల్ నిర్వహించాలని టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇతర పార్టీల నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే టీడీపీ ఎంపీల డెలిగేషన్ బృందం కేంద్ర ఎన్నికల సంఘం తోనూ భేటీ అయి.. పరిస్థితిని వివరించింది. ఇక్కడ జరిగిన దొంగ ఓట్ల దందాను.. కేంద్ర ఎన్నికల అధికారు లకు వీడియోల సహితంగా వివరించారు. వెంటనే ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించాలని వారు కోరుతున్నారు. అయితే.. కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనా రాలేదు.
ఏదైనా ఇలాంటి సందర్భాలు వెలుగు చూసినప్పుడు .. తక్షణమే ఎన్నికలను నిలిపివేసి.. మరుసటి 24 గంటల్లోరీ పోలింగ్ నిర్వహిచండం ఆనవాయితీ. అయితే.. ఇప్పుడు ఇక్కడ రీ పోలింగ్ నిర్వహించే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే. రాష్ట్ర ఎన్నికలఅధికారులు, తిరుపతి అర్బన్ ఎస్పీ సహా అందరూ కూడా.. ఇక్కడ ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయని, దొంగ ఓట్లు వేశారనేది కేవలం అపోహేనని.. కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక ఇచ్చేశారు.
ఈ క్రమంలో అక్కడి అధికారులు కూడా సంతృప్తి వ్యక్తం చేసినట్టు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ చెప్పుకొచ్చారు. అయినప్పటికీ.. తమ ప్రయత్నం తాము చేస్తున్నామన్నారు. మరోవైపు 24 గంటలు గడిచిపోతే.. ఇక్కడ రీపోలింగ్‌కు అవకాశం లేదని.. ఎన్నికల సంఘంలో పనిచేసిన మాజీ ఉన్నతాధికారులు సైతం చెబుతున్నారు. సో.. ఈ పరిణామాలను గమనిస్తే.. టీడీపీది కంఠ శోషగానే మిగిలిపోతుందని అంటున్నారు. అయినప్పటికీ.. ఏమైనా సంచలన జరుగుతుందోమోనని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.