ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ఒకటైన ‘పుష్ప-2’ గత కొంత కాలంగా నెగెటివ్ విషయాలతోనే వార్తల్లోకి వస్తోంది. ఈ సినిమా షూటింగ్ విషయంలో విపరీతమైన జాప్యం జరగడంతో ఆగస్టు 15 నుంచి డిసెంబరు 15కు రిలీజ్ డేట్ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఐతే ఆ తర్వాత కూడా అనుకున్నంత వేగంగా చిత్రీకరణ జరగడం లేదని.. డిసెంబరు 6 డేట్‌ను కూడా సినిమా అందుకోవడం కష్టమేమో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చకచకా షూటింగ్ జరగాల్సిన టైంలో దర్శకుడు సుకుమార్ అమెరికాకు వెళ్లిపోవడం.. మరోవైపు అల్లు అర్జునేమో గడ్డం తీసేసి ఫ్యామిలీతో వెకేషన్‌కు బయల్దేరడం చర్చనీయాంశంగా మారింది. ఇది దర్శకుడు, హీరో మధ్య విభేదాలకు సూచికలా కనిపించింది. ఇంకో నెల రోజుల్లోపు షూట్ పూర్తి చేసి ఆగస్టులోనే పోస్ట్ ప్రొడక్షణ్ మొదలుపెట్టకపోతే సినిమా డిసెంబరు 6న రిలీజ్ కావడం కష్టమే. ఇలాంటి టైంలో ఇలా జరగడం షాకింగే.
‘పుష్ప-2’ చిత్రీకరణ ఇంకా 20 శాతం మిగిలి ఉన్నట్లు టీం చెబుతోంది. ఇలాంటి టైంలో సుకుమార్ వేగం చూపించకపోవడం.. ఎంతకీ ఈ సినిమా పూర్తి కాకపోవడం పట్ల అల్లు అర్జున్ ఫ్రస్టేట్ అవడం.. ఈ నేపథ్యంలో షూట్‌కు బ్రేక్ పడడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఐతే సమస్య ప్రధానంగా దర్శకుడు సుకుమార్‌తో కాగా.. బన్నీ ఏమో నిర్మాతల మీద తన అసహనాన్ని చూపిస్తున్నట్లు తెలుస్తోంది. వాళ్ల మీద ఇప్పటికే పలుమార్లు గట్టిగా అరిచిన బన్నీ.. చివరికి అసహనంతో గడ్డం తీసేసి వెకేషన్‌కు వెళ్లిపోయాడు. గడ్డం లేకుంటే సినిమాలో కంటిన్యుటీ సీన్లకు ఇబ్బంది ఏర్పడుతుంది. మళ్లీ షూట్ ప్లాన్ చేసుకున్నా బన్నీ మీద సీన్లు తీయడానికి ఇబ్బంది అవుతుంది. మరి ఎలా మేనేజ్ చేస్తారన్నది అర్థం కాని విషయం.
బన్నీ అసహనాన్ని చూసి సుకుమార్ మీద ఒత్తిడి తేవడానికి ప్రయత్నిస్తే.. ఆయన కూడా నిర్మాతల మీదే తన ఫ్రస్టేషన్ చూపిస్తున్నారట. ఇలా ప్రెజర్ చేస్తే ఔట్ పుట్ దెబ్బ తింటుందని.. మెడ మీద కత్తి పెట్టి పని చేయించలేరని అంటున్నారట. అసలే చిత్రీకరణలో విపరీతమైన జాప్యం జరగడం వల్ల, ఆగస్టు 15 నుంచి సినిమాను వాయిదా వేయడం వల్ల నిర్మాతలు భారీగా నష్టపోయారు. ఇప్పుడు దర్శకుడు, హీరో తీరుతో వాళ్లు మరింత ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ అడ్డంకులన్నీ దాటి పుష్ప-2 త్వరగా పూర్తయి డిసెంబరు 6కైనా ప్రేక్షకుల ముందుకు వస్తుందా అన్నది ప్రశ్న.