‘తల్లికి వందనం’ పథకంపై ఎన్డీఏ ప్రభుత్వం వెనక్కు తగ్గిందంటూ వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. కేవలం తల్లికి మాత్రమే 15 వేల రూపాయలిస్తామని జీవో విడుదలైందంటూ హడావిడి చేశారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు ఖండించారు. తల్లికి వందనం పథకంపై వైసీపీ నేతలది విష ప్రచారం అని, తల్లికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15 వేల రూపాయలిస్తామని అన్నారు. ఈ పథకంపై ఇంకా విధివిధానాలు పూర్తిస్థాయిలో నిర్ణయించలేదని చెప్పారు.
కానీ, నెల రోజులుగా వైసీపీ కరపత్రిక సాక్షిలో ఈ విషయంపై దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. పవన్, లోకేష్, చంద్రబాబు మనసులో తొంగి చూసి వార్తలు రాస్తున్నట్లు ఫీల్ అవుతున్నారని మండిపడ్డారు. జగన్ లాగా కాకుండా ఐదేళ్లు తల్లికి వందనం అమలు చేస్తామని నిమ్మల చెప్పారు.