ఏపీలో ఉచిత ఇసుక పాలసీ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. కేవలం ఇసుక లోడింగ్ చార్జీలు, సీనరేజీ, రవాణా, ఇతర ఖర్చులు మాత్రమే వసూలు చేస్తున్నారు. కేవలం డిజిటల్ పేమెంట్ల ద్వారా మాత్రమే ఉచిత ఇసుకకు డబ్బు చెల్లించాలని పేర్కొన్నారు. 2024 కొత్త ఇసుక పాలసీని రూపొందించి ప్రజలకు ఉచితంగా ఇసుక అందిస్తున్నారు. కానీ, వైసీపీ సోషల్ మీడియాలో మాత్రం కొన్ని ఫేక్ ఎడిట్ లు చేసి ఇసుక రేట్లు గతంలో కంటే ఇప్పుడే ఎక్కువ అని ప్రచారం చేస్తున్నారు. వైసీపీ హయాంలో ఇసుక టన్ను 300 రూపాయలకు దొరికితే ఇప్పుడు టన్ను 1200 రూపాయలు పడుతుంది అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఇసుక ధరలపై టీడీపీ సోషల్ మీడియా క్లారిటీ ఇచ్చింది. వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియా విభాగం చేస్తున్న అసత్య ప్రచారలను ఖండిస్తూ ఆధారాలతో సహా వారి విష ప్రచారాన్ని బట్టబయలు చేసింది. ప్రకాశం జిల్లాలోని మార్కెట్ యార్డ్ లో మెట్రిక్ టన్ను ఇసుక ధర 247 రూపాయలు. అధికారికంగా గనులు శాఖ వెబ్సైట్ లో ఉన్న వివరాలను షేర్ చేస్తూ వైసీపీ ప్రచారాన్ని టీడీపీ సోషల్ మీడియా ఖండించింది. ఇసుక తవ్వకం, లోడింగ్, సీవరేజి ఇతర ఖర్చు మాత్రమే తీసుకుంటున్నారని చెప్పింది.
ఇక, చిత్తూరులో 20 టన్నుల ఇసుక లారీ కేవలం రూ.4000/- కే అందుబాటులోకి వచ్చింది. అంటే, టన్ను ఇసుక కేవలం రూ.200/- మాత్రమే. అది కూడా రవాణా మరియు లోడింగ్ ఛార్జీలకు మాత్రమే. అదే, గతంలో జగనన్న ప్రభుత్వంలో మొత్తం ఇసుక చెన్నైకి తరలించేసి, ఇక్కడ లారీ ఇసుక రూ.60,000/- వరకూ బ్లాక్ లో అమ్మే రోజులు అందరికీ గుర్తున్నాయి. దీంతో, వైసీపీ దోపిడీ ఏ రేంజ్ లో జరిగిందో తెలుసుకొని ప్రజలు మండిపడుతున్నారు.
అంతేకానీ ఇసుక కొనేందుకు ఎక్కడ ఎవరు డబ్బులు చెల్లించడం లేదని ఇచ్చింది. ప్రకాశం జిల్లాలో జిల్లా కలెక్టర్ మరియు చైర్మన్ జిల్లా కమిటీ పేరుతో బ్యానర్లు కూడా వేయించారు. డిపో దగ్గర టన్ను ఇసుక ధర 247 రూపాయలు మాత్రమేనని ప్రకటించారు. ఒకవేళ దీనిపై ఏమైనా ఫిర్యాదులు ఉంటే ఎవరైనా ఎక్కువ డబ్బులు వసూలు చేస్తుంటే టోల్ ఫ్రీ నెంబర్ కు కూడా ఫోన్ చేయవచ్చని ఒక నెంబర్ అందుబాటులో ఉంచారు. ఇంత పారదర్శకంగా గనులు భూగర్భ శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా ఇసుకను ప్రజలకు అందిస్తున్నా సరే వైసీపీ నేతలు మాత్రం టీడీపీపై విష ప్రచారం చేసే కార్యక్రమాన్ని ఆపడం లేదని బురద చల్లడం మానడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇకనైనా వాస్తవాలు గ్రహించి ఇటువంటి తప్పుడు ప్రచారాలు మానుకోకుంటే ప్రజలు రాబోయే ఎన్నికల్లో కనీసం ఆ 11 స్థానాలు కూడా ఇచ్చే అవకాశం ఉండదని సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది.