బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొనే తన కెరీర్ లోనే తొలిసారి ఒక తెలుగు సినిమాకు సంతకం చేసింది. అదే కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విక్ డైరెక్ట్ చేసిన ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీలో ప్రభాస్ హీరోగా నటించాడు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీతో సహా ఎందరో స్టార్స్ ఈ మూవీలో భాగం అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా కల్కి చిత్రం జూన్ 27న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ముంబైలో కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.
రానా దగ్గుబాటి హోస్ట్ గా చేసిన ఈ ఈవెంట్ కు ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ఈవెంట్ ఎందరో సందడిగా సాగింది. ఎనిమిది పదుల వయసులో ఉన్నప్పటికీ బిగ్‌బీ అదిరిపోయే లెవల్ లో హంగామా చేసి నవ్వులు పూయించారు. అయితే ప్రస్తుతం దీపికా పదుకొనే ప్రెగ్నెంట్ కావడంతో.. కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆమె బేబీ బంప్ తో దర్శనమిచ్చింది. నలుపు రంగు దుస్తుల్లో ప్రకాశవంతంగా మరియు మంచి ఉత్సాహంతో స్టైలిష్‌గా కనిపించింది.
అయితే ఈ ఈవెంట్ లో దీపికా తన ఎడమ చేతికి ధరించిన బ్రేస్లెట్ ధర ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. మూడు డైమండ్ బ్రేస్లెట్లను కలిపి ఒకటిగా దీపికా తన హ్యాండ్ కి ధరించింది. ఇందులో అత్యంత ఆకర్షణీయమైన పాంథెర్ డి కార్టియర్ బ్రేస్లెట్ 18కె వైట్ గోల్డ్ తో రూపొందించబడింది. మిరుమిట్లుగొలిపే పచ్చలు మరియు వజ్రాలతో అలంకరించబడింది. అలాగే జస్టే అన్ క్లౌ బ్రేస్లెట్ మరియు రోజ్ గోల్డ్‌లోని పాంథెర్ డి కార్టియర్ బ్రేస్లెట్ తో ఆమె తన లుక్ ను పూర్తి చేసింది. వీటి మొత్తం విలువ అక్షరాల రూ. 1.16 కోట్లు. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు కళ్లు తేలేస్తున్నారు. దీపికా బ్రేస్లెట్ సెట్ దొరికితే లైఫ్ సెట్టైపోద్దంటూ మాట్లాడుకుంటున్నారు.