ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎన్డీఏ కూటమి ఏర్పాటులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కు ఏపీ సీఎం చంద్రబాబు …. డిప్యూటీ సీఎం పదవితో పాటు పలు మంత్రిత్వ శాఖలు కేటాయించారు. అయితే, ఇప్పటికే ఎన్నికల ప్రచారం, సీట్ల కేటాయింపు వంటి కారణాల నేపథ్యంలో ఏడాదిన్నర కాలంగా పవన్ కళ్యాణ్ సినిమా షూటింగులకు దూరంగా ఉంటున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆయన నటిస్తున్న హరిహర వీరమల్లు, భగత్ సింగ్, ఓజీ చిత్రాల షూటింగ్ లు పెండింగ్‌లో ఉన్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పవన్ ఆ చిత్రాలు పూర్తి చేస్తారని నిర్మాతలు, దర్శకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ సినిమాలకు, రాజకీయాలకు న్యాయం చేయడం కుదురుతుందా లేదా అన్న చర్చ జరుగుతోంది. పూర్తిగా రాజకీయాలకు, మంత్రిత్వ శాఖలకు న్యాయం చేసేందుకు పవన్ సినిమాలకు స్వస్తి పలుకుతున్నారంటూ సోషల్ మీడియాలో పుకార్లు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఆ పుకార్లపై మెగాస్టార్ చిరంజీవి తనయురాలు సుష్మిత స్పందించారు.ఆ వార్తల్లో, ఆ ప్రచారంలో నిజం లేదని, బాబాయి పవన్ కళ్యాణ్ సినిమాలకు పాస్ చెప్పే అవకాశం ఉందని, పూర్తిగా సినిమాలకు దూరం కారని స్పష్టం చేశారు. బాబాయ్ సినిమాలో మానేస్తున్నారు అన్న వార్తను ఆయన అభిమానులకు తట్టుకోలేరని సుష్మిత చెప్పారు.
చేతిలో ఉన్న మూడు చిత్రాలు పూర్తి చేసిన తర్వాత పవన్ కొత్త సినిమాలు చేస్తారా లేదా అన్న విషయంపై సుష్మితను క్లారిటీ ఇచ్చారు. బాబాయ్ సినిమాలకు బ్రేక్ ఇస్తారు తప్పితే వందకు వందశాతం గుడ్‌బై చెప్పరు అని అన్నారు. ఆయన సినిమాలు చేయడం మానేస్తే అది అభిమానులకు గుండె పగిలే వార్త అవుతుంది అని చెప్పారు.