చట్టంలోని కొన్ని అంశాలు పాపులర్ అయినంత బాగా.. మరికొన్ని అంశాలుపెద్దగా ఫోకస్ కావు. ఇప్పుడు అలాంటి ఒక అంశాన్ని ఆయుధంగా మార్చుకున్న బెంగళూరు పోలీసులు టూవీలర్ దారులకు చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటివరకు వినని ఒక కొత్త అంశాన్ని చూపించి..కేసులు నమోదు చేస్తూ.. ఫైన్ల మోత మోగిస్తున్నారు. హెల్మెట్ పెట్టుకున్నా కొందరు ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేస్తారు. ఎందుకలా? అని అడిగితే.. హెల్మెట్ పెట్టుకోవటంతో సరిపోదు. హెల్మెట్ కు ఉన్న బకెల్ కూడా పెట్టుకోవాలి. అందుకే అంటూ ఫైన్ వాయిస్తారు.
ఒకట్రెండు సంవత్సరాలుగా టూవీలర్ మీద ఉండే రియర్ వ్యూ మిర్రర్స్ ను ఉపయోగించటం లేదని కేసులు పెట్టటం తెలిసిందే. అలాంటివి తప్పనిసరి అని.. అవి లేకుంటే కేసులు పెట్టే అవకాశం పోలీసులకు ఉందని తెలీని వారెందరో ఫైన్లు కట్టాల్సి వచ్చింది. తాజాగా బెంగళూరు మరో కొత్త అంవాన్ని తెర మీదకు తీసుకొచ్చారు.
ఇటీవల కాలంలో ప్రమాదాలకు కారణం ఏమిటన్న అంశంపై సర్వే చేసినప్పుడు.. ఇండికేటర్లు.. రివర్ వ్యూ మిర్రర్స్ ఉపయోగించకపోవటం అన్న విషయాన్ని గుర్తించారు.
దీంతో.. అప్పటి నుంచి బండికి ఇండికేటర్లు లేకున్నా.. అవి పని చేయకున్నా.. ఫైన్ల మోత మోగిస్తున్నారు. బెంగళూరు పోలీసులు అనుసరిస్తున్న ఈ విధానం గురించి హైదరాబాద్ పోలీసులకు తెలిస్తే మాత్రం చలానాల మోత మోగించటం ఖాయం. ఎందుకైనా మంచిది తెలుగు రాష్ట్రాల పోలీసులు కళ్లు తెరవటానికి ముందే.. మీ టూవీలర్ కు ఇండికేటర్లు..రియర్ వ్యూ మిర్రర్లు సరిగా ఉన్నాయా? లేదా? అన్న విషయాన్ని చెక్ చేసుకొంటే మంచిది.