ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో వైసీపీ ఘోర పరాజయం దిశగా, ఎన్డీఏ కూటమి ల్యాండ్ స్లైడ్ విక్టరీ దిశగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఎన్డీఏ కూటమి 160 స్థానాల్లో విజయం సాధించే దిశగా అడుగులు వేస్తోందని కౌంటింగ్ ట్రెండ్స్ చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీ ఘోర పరాజయం ఖాయమైన క్రమంలో సీఎం జగన్ రాజీనామా చేసేందుకు రెడీ అయ్యారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అపాయింట్మెంట్ కోరిన జగన్ మరికాసేపట్లో ఆయనతో భేటీ కాబోతున్నారు. తన రాజీనామా లేఖను గవర్నర్ కు జగన్ సమర్పించబోతున్నారు.
ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల సరళిని బట్టి వైసీపీకి 12-14 స్థానాలలోపు వచ్చే అవకాశముంది. ప్రస్తుతం వైసీపీ లీడ్ లో ఉన్న 12 స్థానాల్లో కూడా 4 స్థానాలలో టీడీపీ నుంచి గట్టిపోటీ ఉంది. అదే సమయంలో జనసేనకు 20 స్థానాల్లో లీడ్ లో ఉంటూ అన్ని స్థానాల్లో విజయం సాధించేలా ట్రెండ్ నడుస్తోంది. దీంతో, ఏపీ అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా అయినా దక్కుతుందా లేదా అన్న చర్చ నడుస్తోంది.