+ కేంద్రంలో పట్టు తగ్గడం ఖాయం!
ప్రస్తుతం జరిగిన ఎన్నికల ఫలితం వచ్చేందుకు మరో వారం రోజుల సమయం ఉంది. అధికార పార్టీ వైసీపీ కనుక ఓడిపోతే.. ఏం జరుగుతుంది? అనేది మౌలిక ప్రశ్న. ఇదే జరిగితే.. ఇప్పటి వరకు కేంద్రంలో పట్టు బిగించిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు అది కోల్పోయే అవకాశం ఉంది. ఫలితంగా ఇది పార్టీపై ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది.
+ చెల్లితో రగడ మరింత!
వైసీపీ కనుక ఓడిపోతే.. రాష్ట్రంలో జగన్ వర్సెస్ ఆయన సోదరి వైఎస్ షర్మిల మధ్య మరింత రాజకీయ వివాదాలు తెరమీదికివచ్చే అవకాశం ఉంది. అదేసమయంలో షర్మిల ప్రభావం పుంజుకుని.. అంతిమంగా అది పార్టీకి ప్రధాన చేటుచేసే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా సీమలో ఇప్పటి వరకు పెంచుకున్న పట్టును కూడా వైసీపీ కోల్పోయే అవకాశం ఉంది.
+ ఓటు బ్యాంకు దూరం
రాష్ట్ర ఎన్నికల్లో వైసీపీ ఓడితే.. అది వైసీపీకి ప్రధాన ఓటు బ్యాంకు అయిన.. మాజీ కాంగ్రెస్ సానుభూతి పరుల ఓటును ప్రభావితం చేస్తుంది. తమ ఓటును వైసీపీ లాగేసుకుందని చెబుతున్న కాంగ్రెస్.. తిరిగి దీనినిసొంతం చేసుకునే ప్రయత్నాలుచేసేందుకు ఛాన్స్ ఉంది. వచ్చే ఐలదేళ్లలపాటు ఓటు బ్యాంకును కాపాడు కోవడం.. వైసీపీ అధినేతకు ఇబ్బందికర పరిణామంగా మారిపోతుంది.
+ వివేకా కేసు దర్యాప్తుతో చిక్కులు
వైసీపీ ప్రస్తుత ఎన్నికల్లోగెలుపు గుర్రం ఎక్కకపోతే.. ప్రధానంగా వచ్చే ఐదేళ్లలో సీఎం జగన్.. తన సొంత బాబాయి వివేకానందరెడ్డికేసును ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఈ కేసులో ఆయన సాక్ష్యాధారాలు దాస్తున్నారని… నిందితులకు మద్దతుగా వ్యవహరిస్తున్నారన్న వాదన కూడా బలంగా వినిపించే అవకాశం ఉంది. మొత్తం గా ఈ కేసుతో తన ప్రమేయం లేకున్నా.. జగన్కు మాత్రం చిక్కులు తప్పవనే మాటే వినిపిస్తోంది.
+ మహిళా ఓట్లపై ప్రభావం..
వైసీపీ కనుక ప్రస్తుత ఎన్నికల్లో ఓడిపోతే.. దీనికి ప్రధాన కారణం.. టీడీపీ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలే అవుతాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు తమకు అనుకూలంగా ఉన్నారని వైసీపీ చెబుతోంది. రేపు ఓటమి ఎదురైతే మాత్రం మహిళా ఓటు బ్యాంకును సగానికి పైగా టీడీపీ సొంతం చేసుకుంటుంది. ఇదే జరిగితే.. వైసీపీకి వచ్చే 2029 నాటికి మహిళా ఓటు బ్యాంకు నిలిచే పరిస్థితి కూడా ఉండదని అంటున్నారు.